పట్టించుకోను అంటూ ఇలా స్పందిస్తే ఎలా సార్!
కరణ్ జోహార్ దీపిక-రణవీర్ సింగ్ డేటింగ్ గురించి అడిగారు. ఇదే ప్రధానంగా విమర్శలకు దారి తీసింది.
By: Tupaki Desk | 30 Oct 2023 11:30 AM GMT'కాపీ విత్ కరణ్' సీజన్ 8 లో కపుల్స్ దీపికా పదుకొణే-రణవీర్ సింగ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆ జోడీ అంతే ఆసక్తికరంగా జవాబులిచ్చింది. అయితే వాటిలో కొన్ని అంశాలపై దీపిక పదుకొణే మాట్లాడిన వ్యక్తిగత విషయాలపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కొన్ని కారణాలతో జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు.. అయితే వృత్తి పరంగా చాలా మందితో చనువుగా ఉన్నప్పటికీ మనసు దోచింది మాత్రం రణవీర్ సింగ్ అని అంది.
అందుకే తన నిర్ణయాన్ని మార్చుకుని అతనితో జీవితాన్ని పంచుకున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ వీడియోలో కొంత భాగాన్ని ప్రచారం చేసి నెటి జనులు విమర్శించారు. నెట్టింట అదే పనిగా ట్రోలింగ్ చేసారు.
దీంతో కరణ్ జోహార్ ఈ ట్రోలింగ్ పై స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి వాటిని పట్టించుకోను అంటూనే పట్టించు కుని మాట్లాడారు. ట్రోలింగ్ నా దాకా వచ్చింది. ట్రోలింగ్ కారణంగా ఎవరి స్థాయి తగ్గదు.
అందుకే వాటిని పట్టించుకోను అని అన్నారు. కానీ నిర్మాణాత్మక విమర్శల్ని మాత్రం అంగీకరించారు. వచ్చే ఎపిసోడ్స్ లో వాటిని సరిచేసుకుంటానని అన్నారు. కరణ్ జోహార్ దీపిక-రణవీర్ సింగ్ డేటింగ్ గురించి అడిగారు. ఇదే ప్రధానంగా విమర్శలకు దారి తీసింది. ఇలాంటి విమర్శలు కరణ్ కి కొత్తేం కాదు. గతంలో చాలా మంది సెలబ్రిటీల్ని..భార్య భర్తల్ని అభ్యంతరక ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కోకొల్లలు.
అమీర్ ఖాన్ -కరీనా కపూర్ జంటగా పాల్గొన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తే కరణ్ పై తనదైన శైలిలో అమీర్ బధులిచ్చిన సంగతి తెలిసిందే. అయినా కరణ్ టాక్ షోలో ఎలాంటి మార్పులు రాలేదు. నా దారి నాదే...మీ పనిమీదే అన్నట్లు యధావిధిగా నడుస్తున్నారు.తాజా ట్రోలింగ్ కరణ్ లో మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. బోల్డ్ కంటెంట్ విషయంలో అతి చేయకుండా జాగ్రత్త పడతాను అన్నట్లు చెప్పుకు రావడం విశేషం.