సెక్స్ లైఫ్ లేదు అంటూ తనపై తానే జోక్స్ వేసుకుంటున్న డైరెక్టర్!
ఈసారి కరణ్ మొదటి ప్రోమోలో తనపై తానే జోకులు వేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ (నిందించుకుంటూ) ఆశ్చర్యపరిచాడు. ఈ టీజర్ చాలా ఫన్నీగా అలరించింది.
By: Tupaki Desk | 5 Oct 2023 8:34 AM GMTఅతడిని ప్రేమించండి.. ద్వేషించండి.. ట్రోల్ చేయండి.. అవమానించండి! కానీ అతడి షో మాత్రం వదలకుండా చూస్తారు. ఇంతకీ అతడు ఎవరు? అంటే కచ్ఛితంగా ది గ్రేట్ కరణ్ జోహార్ గురించే ఇదంతా. కరణ్ హోస్టింగ్ చేసే పాపులర్ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'ను యూత్ విస్మరించలేరు. దర్శకనిర్మాత, హోస్ట్ కరణ్ జోహార్ టాక్ షో ఏడు సీజన్లు అగ్గి రాజేసాయి. ఈ షోలో ప్రముఖ స్టార్ల బెడ్ రూమ్ లైఫ్ .. లైంగిక జీవితాల గురించి ప్రతిదీ ఓపెన్ చేయించాడు. అంతే కాదు.. తన అభిమాన తారలు అలియా భట్ -అనన్య పాండేల లవ్ లైఫ్, బెడ్ రూమ్ జీవితాల్లోని కొత్త విషయాలను బయటికి లాగాడు.
KWK గత సీజన్ అంతా కంగనా రనౌత్ ఆరోపణల గురించి ప్రస్తావించడం కొసమెరుపు. కరణ్ సోఫాలో ఉన్న ప్రతి స్టార్‌కి సెక్స్ సంబంధిత ప్రశ్నలు తప్పనిసరి అయ్యాయి. అయితే ఈ అతి వీక్షకులను చికాకు పెట్టడంతో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షో మరో సీజన్‌తో తిరిగి వచ్చింది. కరణ్ జోహార్ బుధవారం తన సోషల్ మీడియాల్లో 'కాఫీ విత్ కరణ్' 8వ సీజన్ ప్రారంభిస్తున్నామని ప్రకటించాడు. ఈసారి కరణ్ మొదటి ప్రోమోలో తనపై తానే జోకులు వేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ (నిందించుకుంటూ) ఆశ్చర్యపరిచాడు. ఈ టీజర్ చాలా ఫన్నీగా అలరించింది. టీజర్లో 'కాఫీ విత్ కరణ్' ఏడవ సీజన్లో తనపై వచ్చిన విమర్శలన్నింటినీ ప్రస్తావిస్తూ తన మనస్సాక్షిని ఆవిష్కరించాడు.
కరణ్ మనస్సాక్షి కరణ్‌ని ప్రశ్నిస్తుంటుంది.. అంటూ డబుల్ రోల్ (ఒకరు ఒరిజినల్.. ఇంకొకరు మనస్సాక్షి) ని పరిచయం చేసాడు కరణ్. గత సీజన్లో ఎవరైనా మీ కాఫీలో ఏదైనా కలిపారా? అంటూ సంభాషణల్లో బోలెడంత ఫన్ ని కురిపించాడు. కాఫీలో కలిపినవి చాలా తండా(కూల్)గా ఉన్నాయి. మీరు దానిని కోల్డ్ కాఫీ విత్ కరణ్ అని పిలవవచ్చు. కరణ్ ఛీజీ జోకుల్లో భాగంగా నటవారసుల్ని టార్గెట్ చేయడం ఫన్నీ.. నేపో బేబీలు మాత్రమే కరణ్ సోఫాను అలంకరించేవారని అతడి మనస్సాక్షి కూడా నిలదీయడం కొసమెరుపు. మనస్సాక్షి కరణ్.. అసలైన కరణ్‌ని దూషిస్తూ ''ఒక 50 ఏళ్ల వ్యక్తి .. 20 ఏళ్ల యువకులను వారి లైంగిక జీవితాల గురించి అడుగుతాడా? .. అవిటివాడు'' అని జోక్ చేస్తూనే.. ఈసారి తాను వినూత్నంగా వ్యవహరిస్తానని, నేపో పిల్లల మనవలు, కొత్తగా పెళ్లయిన సెలబ్రిటీ జంటలు లేదా క్రికెటర్లను ఆహ్వానిస్తానని కరణ్ చెప్పాడు. నేను సీజన్ 8ని రెడీ చేస్తున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు.
కరణ్ తనను తాను క్రూరంగా ట్రోల్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరు వ్యాఖ్యానిస్తూ..''నేను అతడిని ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే అతడు చాలా నమ్మకంగా ట్రోల్‌లను కూడా మంచి మార్కెటింగ్ ఆలోచనలుగా మార్చాడు!'' అని పొగిడేశాడు. ఈసారి మీకు అలియా-రణ్‌బీర్, రణవీర్-దీపిక, విక్కీ-కాట్, షాహిద్, కరీనా-సైఫ్ మొదలైన వారి పిటి లిస్ట్‌కు బదులుగా కొత్త అతిథులు వస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ ఒకటే ప్రశ్నలు .. ప్రతి సీజన్లో ఒకే విధమైన సమాధానాలను పొందండి!! కొత్త సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం.. అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్‌ను షేర్ చేస్తూ కరణ్ ఇలా రాసాడు. నా సొంత కాన్సైన్స్(మనస్సాక్షి) నన్ను కూడా ట్రోల్ చేయాలని కోరుకుంటుంది! కానీ అతడు(మనస్సాక్షి) ఏమనుకుంటున్నాడో కనిపెట్టండి. నేను ఇంకా సీజన్ 8ని ప్రిపేర్ చేస్తున్నాను! అని తెలిపాడు. అక్టోబర్ 26న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ప్రసారం ప్రారంభమవుతుంది.