కాంట్రవర్సీ పాయింట్ తో కరణ్ జోహార్ కొత్త సీరీస్
ఈ కాంట్రవర్సీ పాయింట్ ని పట్టుకొని బాలీవుడ్ లో రియల్ డ్రామాని వెబ్ సిరీస్ రూపంలో షో టైమ్ పేరుతో కరణ్ జోహార్ తన ధర్మాటిక్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 21 Dec 2023 10:26 AM GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో నెపోటిజం అనే కాన్సెప్ట్ విస్తృతంగా నడుస్తోంది. అలాగే వారసుల కుటుంబం నుంచి వచ్చి స్టార్స్ అయిన వారు, అలాగే బయటి నుంచి వచ్చి స్టార్స్ గా నిలబడే ప్రయత్నం చేస్తున్నవారి మధ్య ఒక తెలియని ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇన్ సైడర్, అవుట్ సైడర్స్ అంటూ వేరు చేసి చూస్తారని ప్రచారం మీడియా సర్కిల్ లో ఉంది.
ఈ కాంట్రవర్సీ పాయింట్ ని పట్టుకొని బాలీవుడ్ లో రియల్ డ్రామాని వెబ్ సిరీస్ రూపంలో షో టైమ్ పేరుతో కరణ్ జోహార్ తన ధర్మాటిక్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. కలర్స్ ప్రపంచంలో సినీ తారల లైఫ్ స్టైల్ అందులో షూటింగ్ ల సందడి, యాక్టర్స్ మధ్య ఆధిపత్య పోరు వంటి అంశాలని ఈ షోటైమ్ టీజర్ లో చూపించారు.
నిజానికి కరణ్ జోహార్ మీదనే కొంతమంది సెలబ్రెటీలు స్టార్ ఫ్యామిలీల నుంచి వారసులని ప్రోత్సహించి బయటి నుంచి వచ్చేవారికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి కాంట్రవర్సీ కాన్సెప్ట్ తో సిద్ధమవుతోన్న షోటైమ్ ని కరణ్ జోహార్ నిర్మించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మీ స్టార్ హీరోగా నటిస్తున్నాడు.
అతనికి పోటీ ఇచ్చి స్టార్ గా ఎదగాలని ప్రయత్నం చేసే హీరోగా రాజీవ్ ఖండేల్వాల్ కనిపిస్తున్నాడు. నిర్మాత పాత్రలో నసీరుద్దీన్ షా, మౌనీ రాయ్, శ్రియ శరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. మరి ఈ బాలీవుడ్ రియాలిటీతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ ఈ షోటైమ్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ ని నిర్మించినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి సుమిత్ రాయ్ కథ అందించారు.