అంబానీ పెళ్లిలో ఖరీదైన వజ్రం పోగొట్టుకుని ఏడ్చేసిన నటి
దాదాపు 5000 కోట్ల ఖర్చుతో కొన్ని నెలల పాటు సాగిన అంబానీల పెళ్లిలో చాలా మెరుపులు మిరుమిట్లు ప్రజల్ని ఆకర్షించాయి.
By: Tupaki Desk | 15 March 2025 9:32 AM ISTదాదాపు 5000 కోట్ల ఖర్చుతో కొన్ని నెలల పాటు సాగిన అంబానీల పెళ్లిలో చాలా మెరుపులు మిరుమిట్లు ప్రజల్ని ఆకర్షించాయి. అయితే ఇదే పెళ్లిలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన మెడలో ధరించిన భారీ వజ్రాల హారం నుంచి ఒక ఖరీదైన వజ్రాన్ని పోగొట్టుకుని చాలా కలత చెందింది.
ముంబైలో గురువారం `ది కర్దాషియన్స్` ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఈవెంట్ లో.. తాను భారీ వజ్రాన్ని కోల్పోయినప్పుడు చాలా కుంగిపోయానని కిమ్ అంగీకరించింది. ఓ కథనం ప్రకారం.. అంబానీలతో పరిచయం లేకపోయినా కానీ 44 ఏళ్ల కిమ్, సోదరి 40 ఏళ్ల ఖ్లో కర్దాషియాన్ ఒక మధ్యవర్తి కారణంగా, జూలై 2024న జరిగిన అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యారు.
వరుడు అనంత్ అంబానీ, అతడి సోదరి తల్లితో కలిసి ఉండగా కిమ్ కర్ధాషియన్ మెడలో ధరించిన భారీ హారంలో ఉన్న వజ్రాలలో ఒకటి పడిపోయింది. ఇది కిమ్‌ను భయాందోళనకు గురిచేసింది. నగలోంచి వజ్రం పడిపోయిందని చెప్పడానికి నగల డిజైనర్ లోరైన్ స్క్వార్ట్జ్‌కు కర్ధాషియన్ సిస్టర్స్ ఫోన్ చేశారు. ఇది పెద్ద వజ్రాల హారము ..దాని నుండి ముత్యాలు - పెద్ద పియర్ ఆకారపు వజ్రాలు వేలాడుతూ ఉన్నాయి. వాటిలోంచి ఒక వజ్రం పోయింది.
ఆ సమయంలో కిమ్ - ఖ్లోయ్ వెన్యూ వద్ద నేలపై వజ్రం కోసం వెతికారు. అయితే ఆ వజ్రం కిమ్ పైభాగంలో ధరించిన దుస్తుల్లో లేదా ఆమె స్కర్ట్‌లో పడి ఉండవచ్చని భావించారు. కానీ ఎంత వెతికినా వజ్రం ఎక్కడా కనిపించడం లేదు. దుస్తుల్లో లేదా తన సోదరి వక్షోజాలలో చిక్కుకుందా? ఎప్పటికీ తెలియదు అని ఖోయ్ లే అంత టెన్షన్ లోను జోక్ చేసింది. కిమ్ మాట్లాడుతూ... హారం ధరించి నేను నడిచాను. ఆ కొన్ని అడుగులలో ఎవరినీ కౌగిలించుకోలేదు. నేను దానిని పోగొట్టుకునేంతలా ఏమీ జరగలేదని వ్యాఖ్యానించింది. కిమ్ తో పాటు వజ్రాల హారం డిజైనర్, ఇతరులు పడిపోయిన వజ్రం కోసం చాలా వెతికారు. ``ఓ మై గాడ్. నేను దీనికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది`` అని కిమ్ ఒక సభలో విలపించింది కూడా. మొత్తానికి వజ్రం పోగొట్టుకోవడంతో పెళ్లిలో కిమ్, ఖోయ్ లే చాలా నీరసపడిపోయారు. చాలా ఆందోళనగా గడిపారు. సోదరీమణులు ఒక ప్రైవేట్ గదిలోకి చేరుకుని షాంపైన్ తాగి, వజ్రం దొరికిందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వజ్రం కోసం వెతుకుతూ అక్కా చెల్లెళ్లు ఒకరిపై ఒకరు జోకులు కూడా వేసుకున్నారు.
మొత్తానికి ఈ రియాలిటీ షో ఎపిసోడ్ `అంబానీ వివాహ వజ్రం- ప్రేమపూర్వక జ్ఞాపకార్థం` అని రాసిన నల్ల తెరపై తెల్ల అక్షరాలతో కూడిన టైటిల్ కార్డ్‌తో ముగిసింది. ది కర్దాషియన్స్ ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతోంది. కొత్త ఎపిసోడ్‌లు హులులో విడుదలయ్యాయి.