పెద్దమ్మ మీద పడి జెహ్ రక్కేస్తాడా!
అవును ఈ విషయాన్ని స్వయంగా కరీష్మా కపూర్ ఓ షోలో రివీల్ చేసింది.
By: Tupaki Desk | 17 Oct 2024 6:30 AM GMTకరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ కి ఇద్దరు కుమారులున్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్ కాగా, చిన్న కుమారుడు పేరు జెహ్. మరి వీరిద్దరిలో అల్లరి గడుగ్గాయ్ ఎవరు? అంటే చిన్నోడు జెహ్ అని తెలుస్తోంది. అన్నీ అమ్మలక్షణాలే వచ్చాయట. ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండడుట. జెహ్ అల్లరి చూసి పెద్దమ్మ కరీష్మా కపూర్ కి పిచ్చెక్కిపోతుందిట. అవును ఈ విషయాన్ని స్వయంగా కరీష్మా కపూర్ ఓ షోలో రివీల్ చేసింది.
వివరాల్లోకి వెళ్లే. కరీనా కపూర్ కరిష్మా కపూర్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. ఇది ఎంతో సరదాగా సాగిన ఎపిసోడ్ .అక్కా-చెల్లి ఇద్దరు ఎంతో ఓపెన్ గా పరిశ్రమ విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే తమ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తమ బంధం చాలా బలంగా ఉందంన్నారు. కరీష్మాకపూర్,కరీనా కపూర్, సోదరుడు రణబీర్ కపూర్ ఎప్పుడూ గాసిప్పులో కనిపిస్తుంటారు.
ఏవైనా గాసిప్పులు వచ్చినప్పుడు ముగ్గురు ఎంతో ఓపెన్ గా మాట్లాడుకుంటారుట. కరీనా మాత్రం అప్పుడప్పుడు తనని తాను సమర్దించుకోవడంలో ముందుంటుందని కరీష్మీ కపూర్ ఆట పట్టించింది. చెల్లి చిన్న నాటి నుంచి అల్లరి పిల్ల అని.. అదే అల్లరి చిన్న కొడుకు జెహ్ కి వచ్చిందన్నారు. ఇంటికెళ్తే మీద పడి రక్కేస్తాడు అంది.
కరీష్మా మాట్లాడుతోన్న సమయంలో కపిల్ శర్మ మరింత హాస్యాన్ని జోడించి సన్నివేశాన్ని రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం కరీనా కపూర్ సింగం ఎగైన్ రిలీజ్ కోసం రెడీ అవుతుంది. దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కరీనా ఓ పవర్ పుల్ పాత్రతో అలరించనుంది.