సైఫ్ ను చూసి నన్ను పట్టించుకోలేదు.. అసలు విషయం చెప్పిన కరీనా..
ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటూ బోల్డ్ కంటెంట్ ని కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే కరీనా కేరీర్ లో ఓంకార చిత్రం ప్రత్యేకమైనది.
By: Tupaki Desk | 19 Sep 2024 11:30 AM GMTబాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ కరీనాకపూర్. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఆమె అడుగు పెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కరీనా తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటూ బోల్డ్ కంటెంట్ ని కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే కరీనా కేరీర్ లో ఓంకార చిత్రం ప్రత్యేకమైనది.
ఈ మూవీ లో ఆమె తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసిన నటించింది. ఈ చిత్రంతో పాటు ఈ జంట 'రోడ్ సైడ్ రోమియో','కుర్బాన్', 'తషాన్', 'ఏజెంట్ వినోద్’లాంటి పలు చిత్రాలలో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2012లో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కరీనా తన కెరీర్ లో ఎంతో సెలెక్టివ్ గా ఉంటున్నారు. తనని తాను ప్రూవ్ చేసుకునే పాత్రలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఓంకార గురించి మాట్లాడుతూ కరీనా’ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో నేను పోషించిన రోల్ ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది. నేను ఈ మూవీ లో నా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాను అని భావిస్తాను. అందుకే ప్రముఖ దర్శకుల కోసం ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశాను. సినిమా చూసిన వాళ్ళందరూ నా యాక్టింగ్ ని మెచ్చుకున్నారు కానీ ఇంటర్వల్ పూర్తయ్యేసరికి అందరూ సైఫ్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు అక్కడ అందరూ సైఫ్ ఎక్కడ అని నన్ను వచ్చి అడిగారు. నన్ను మెచ్చుకుంటారు అని అందర్నీ పిలిస్తే వాళ్లేమో సైఫ్ గురించే మాట్లాడారు’అని అంది.
ఇక తాజాగా సైఫ్ తెలుగులో నటిస్తున్న దేవర చిత్రం గురించి ప్రస్తావించిన కరీనా.. ఈ మూవీ కోసం తాను ఎంతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు త్వరలో సైఫ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న ఆమె ఆశను కూడా వ్యక్తం చేశారు. దీంతో ఈ జంట త్వరలో ఆన్ స్క్రీన్ కూడా ప్రేక్షకులను మురిపించడానికి సిద్ధపడుతోంది అని అందరూ భావిస్తున్నారు. మరో పక్క ప్రభాస్ మూవీ లో సైఫ్ తో కలిసి కరీనా నటించబోతోంది అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు కరీనా కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్టుగా ప్రస్తావించారేమో.. చూడాలి.