Begin typing your search above and press return to search.

నేను కొంప‌లు కూల్చే అమ్మాయిని కాను: బెబో

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ రిలేష‌న్‌షిప్స్ అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. అత‌డు త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సుస్సానే ఖాన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Dec 2024 9:30 PM GMT
నేను కొంప‌లు కూల్చే అమ్మాయిని కాను: బెబో
X

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ రిలేష‌న్‌షిప్స్ అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. అత‌డు త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సుస్సానే ఖాన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. కానీ హృతిక్- సుస్సానే జంట విడిపోయి అభిమానుల‌కు పెద్ద షాకిచ్చారు. టీనేజీ వ‌య‌సు నుంచే ఈ జంట గొప్ప ప్రేమికులు. ఆ త‌ర్వాత ఇంట్లోవాళ్ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు వార‌సులు కూడా ఉన్నారు. వారు పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతున్నారు. కానీ సుస్సానే - హృతిక్ మ‌ధ్య బ్రేక‌ప్ అయింది.

అయితే `క‌హోనా ప్యార్ హై` చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న క‌రీనా క‌పూర్ న‌టించాల్సి ఉండ‌గా, ఆ ఛాన్స్ మిస్స‌యింది. అత‌డి డెబ్యూ చిత్రంలో అమీషా ప‌టేల్ క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత హృతిక్- క‌రీనా క‌పూర్ జంట‌గా ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఆ స‌మ‌యంలో హృతిక్ తో క‌రీనా స‌న్నిహితంగా ఉంటోంద‌ని ప్ర‌చారం సాగింది. సుస్సానేతో హృతిక్ పెళ్లికి ముందు అత‌డితో క‌రీనా డేటింగ్ చేస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. ఇదే విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా క‌రీనా క‌పూర్ ఖాన్ అవ‌న్నీ గాలివార్త‌లు అని కొట్టి పారేసింది.

హృతిక్ మంచి పిల్లాడు... అలా చేయ‌డు! అని కితాబిచ్చిన క‌రీనా క‌పూర్ త‌న‌కు సుస్సానే బెస్ట్ ఫ్రెండ్ అని.. త‌న విష‌యంలో అలా చేయ‌న‌ని అంది. అంతేకాదు.. నేను వేరొక స్త్రీ ఉసురు పోసుకోలేనని కూడా క‌రీనా వ్యాఖ్యానించింది. హృతిక్ అప్ప‌టికే క‌మిట‌య్యాడు.. సుస్సానేతో ప్రేమ‌లో ఉన్నాడు. అందువ‌ల్ల ఆ ప‌ని చేయ‌లేన‌ని కూడా క‌రీనా అంది. నాపై అప్ప‌ట్లో ప్ర‌చార‌మైన గాసిప్స్ కి చాలా షాక‌య్యాన‌ని కూడా క‌రీనా తెలిపింది. తాను విదేశాల‌కు వెళ్లి రాగానే, ఈ వార్త‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయ‌ని, అది తెలిసి షాక్ లో ఉండిపోయాన‌ని వెల్ల‌డించింది.

``హృతిక్ చాలా సెన్సిబుల్ కుర్రాడు. అత‌డు ఎవ‌రికీ ప‌డిపోడు. సుజాన్‌కి నాకు ఈ విష‌యం బాగా తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో సుజాన్ కి క‌చ్చితంగా తెలుసు``న‌ని క‌రీనా అన్నారు. నేను మరొక స్త్రీ ప్రేమించే పురుషుడిని ఎందుకు కోరుకుంటాను? అది కూడా నేను ఇష్టపడే గౌరవించే స్త్రీ? .. నేను చాలా స్వార్థపరురాలిని. నా కోసం నాతో ఉండే మనిషి కావాలి. నేను నావాడిని ఎవరితోనూ షేర్ చేసుకోలేను అని కూడా తెలిపింది.

నేను ఒక‌రి ఇల్లు (కొంప‌) కూల్చే ఆడ‌దానిని కాదు.. నేను ఎప్పటికీ అలా ఉండలేను. ఇతరుల ఇళ్లలో విధ్వంసం సృష్టించేదుకు మ‌మ్మ‌ల్ని పెంచ‌లేదు. అయినా నేను మరొక స్త్రీ శాపం కోరుకోను. ఆ శాపం ఒక‌ స్త్రీకి ఏం చేస్తుందో కూడా నాకు బాగా తెలుసు. అయితే హృతిక్ అద్భుతమైన కుర్రాడు. అతడితో క‌లిసి ప‌ని చేసినంతగా ఎవరితోనూ పనిచేయడం నాకు ఇష్టం లేదు... అని వెల్ల‌డించింది బెబో.