Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఆ బ్యూటీ సంచ‌ల‌నం..మ‌హేష్‌..ప్ర‌భాస్ తోనా?

క‌రీనా క‌పూర్ బాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 5:39 AM GMT
టాలీవుడ్ లో ఆ బ్యూటీ సంచ‌ల‌నం..మ‌హేష్‌..ప్ర‌భాస్ తోనా?
X

క‌రీనా క‌పూర్ బాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా క‌రీనాది ఎంతో సుదీర్ఘ ప్ర‌స్తానం. ఇటీవ‌లే 25 వ‌సంతాలు కూడా పూర్తి చేసుకుంది. అమితాబ‌చ్చ‌న్...దిలీప్ కుమార్ త‌ర్వాత అరుదైన గౌర‌వం ద‌క్కించుకుంది. ఇదంతా కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ వ‌ర‌కూ ప‌రిమితం. ఇంత‌వ‌ర‌కూ బాలీవుడ్ ని దాటి ఇత‌ర భాష‌ల్లో క‌రీనా క‌పూర్ సినిమాలు చేసింది లేదు. ఆ ఆస‌క్తి కూడా ఏ నాడు చూపించ‌లేదు.


ఇటీవ‌లే హాలీవుడ్ కి వెళ్ల‌రా? అంటే అలాంటి ఆశ‌లేం లేవు అంటూ ఉన్నంత కాలం ఇండియాలోనే నా ప్ర‌యాణం అంటూ చెప్పేసింది. అయితే క‌న్న‌డ చిత్రం `టాక్సిక్` లో క‌రీనా న‌టిస్తుంద‌నే ప్ర‌చారం కొన్ని నెల‌లుగా సాగుతుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ లేదు. మేక‌ర్స్ కూడా స్పందించ‌లేదు. దీంతో టాక్సిక్ లో క‌రీనా న‌టిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా స‌స్పెన్స్ న కొన‌సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో అమ్మడి పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ముఖంగా ఓ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో క‌రీనా పేరు వినిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమాకి స‌న్నాహాలు వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లువుతంద‌ని స‌మాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ కి జోడీగా క‌రీనా సైన్ చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే పాన్ ఇండియా సంచ‌ల‌నం ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా క‌రీనా న‌టిస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి క‌రీనా సైన్ చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే సౌత్ లో క‌రీనా ఓ సినిమాకి సైన్ చేసిన‌ట్లు వినిపిస్తుంది. కానీ అది తెలుగు సినిమా? ఇత‌ర భాష‌కి చెందిందా? అన్న‌ది క్లారిటీ లేని అంశం కావ‌డంతో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.