Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ వేధాంతం... మ్యాటర్‌ ఏంటో?

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌పై జరిగిన కత్తి దాడి నుంచి కుటుంబ సభ్యులు ఇంకా బయటకు రాలేక పోతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 2:30 PM GMT
హీరోయిన్‌ వేధాంతం... మ్యాటర్‌ ఏంటో?
X

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌పై జరిగిన కత్తి దాడి నుంచి కుటుంబ సభ్యులు ఇంకా బయటకు రాలేక పోతున్నారు. ఆయన ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయ్యారు. అయినా కరీనా కపూర్ ఖాన్‌ ఆందోళనతో ఉంది. కుటుంబంలో ఏ ఒక్కరికి చిన్న సంఘటన జరిగినా మొత్తం ఫ్యామిలీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా అదే విషయాన్ని కరీనా కపూర్ ఖాన్‌ కాస్త వేధాంత దోరణితో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మొత్తం జీవితాన్ని మార్చే అవకాశాలు ఉంటాయని కరీనా అభిప్రాయం వ్యక్తం చేసింది. అనుకున్నది ఎప్పుడూ సాఫీగా సాగదని సైతం కరీనా పోస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో కరీనా కపూర్‌ ఖాన్‌.. జీవితంలో మనం అనుకున్నట్లుగా ఏవీ జరగవు. పాటించాలి అనుకున్న సిద్ధాంతాలు, ఊహలు నిజం కావు. ఎక్కువ సార్లు ఇతరుల కంటే మనమే ఎక్కువ తెలివి ఉన్న వాళ్లం అనుకుంటాం. కానీ ఏదో ఒక సమయంలో, సందర్భంలో జీవితం మనకు అన్ని విషయాలను తెలియజేస్తుంది. మనకు ఎదురు అయ్యే సందర్భాలు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయని పోస్ట్‌ చేసింది. కరీనా కపూర్ ఖాన్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ వెనుక ఉద్దేశం ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో కరీనా కపూర్‌ ఖాన్‌ ఈ విషయాన్ని షేర్‌ చేసి ఉంటుంది అని ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సమయంలో మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి, కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చివరకు ఫ్యామిలీ విభేదాలు అంటూ కొందరు పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే కరీనా కపూర్‌ ఖాన్‌ మీడియా వారికి సోషల్‌ మీడియాలో ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంలో తమ గురించి తప్పుడు వార్తలు రాయడం ద్వారా లాభం పొందాలని భావించవద్దు అంది. ప్రస్తుతం తమ ఫ్యామిలీ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని మాకు సహకరించండి అంటూ సోషల్‌ మీడియా ద్వారా కరీనా షేర్ చేసిన పోస్ట్‌ ఆ సమయంలో చర్చనీయాంశం అయ్యింది.

హీరోయిన్‌గా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన కరీనా కపూర్‌ ఖాన్‌ ఇప్పుడు కాస్త తగ్గించింది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన ఇమేజ్‌, స్టార్‌డంకి తగ్గట్లుగా నటిస్తోంది. మరో వైపు సైఫ్‌ అలీ ఖాన్‌ సైతం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గానూ నటించేందుకు ఓకే చెబుతున్నారు. తెలుగు మూవీ దేవరలో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటించారు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే దేవర 2 లో సైఫ్ అలీ ఖాన్‌ పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.