బెబో సెట్లో ఉన్నా? ఆలోచనలన్నీ ఇంటివైపే!
బాలీవుడ్ లో కరీనా కపూర్ ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోయిన్లలో కరీనా ఓ బ్రాండ్ గా ఎంతో ఫేమస్ అయిన నటి
By: Tupaki Desk | 28 Aug 2024 5:21 AMబాలీవుడ్ లో కరీనా కపూర్ ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోయిన్లలో కరీనా ఓ బ్రాండ్ గా ఎంతో ఫేమస్ అయిన నటి. ఇప్పటికీ అదే ఛరిష్మాతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఎంత మంది కొత్త భామలొచ్చినా? తనకు తానే పోటీ. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో సైతం సత్తా చాటుతుంది. అలాగని హీరోల సరసన నో చెప్పడం లేదు. రెండు జోనర్లలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది.
నటిగా తానేప్పుడు బిజీగానే ఉంటుంది. అలాగని కరీనా ఇంటి బాధ్యతల నుంచి ఏ మాత్రం తప్పుకోలేదు. ఇంట్లో పనివాళ్లు, భద్రతా సిబ్బంది అంతా ఉన్నా? సెట్లో ఉన్నంత సేపుత తన ఆలోచనలన్నీ ఇంటివైపే ఉంటాయని అంటోంది. పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు? టైమ్ కి తినారా? లేదా? ఏం తిన్నారు? వంట మనుషులు ఎలాంటి వంటలు చేసి పెట్టారు? సైఫ్ అలీఖాన్ ఏం చేస్తున్నాడు? ఇలా నిత్యం మైండ్ అంతా ఇంటివైపే ఉంటుంది.
షూట్ లేకపోతే ఇంట్లోనే ఖాళీ సమయాన్ని గడుపుతుందిట. కుటుంబ సభ్యులకు స్వయంగా తానే పనులు చేయడం తనకెంతో ఇష్టమంది. అలాగే పని సిబ్బంది ఉన్నా? టేబుల్ క్లీనింగ్ సైతం తానే చేస్తుందిట. ఓ సాధారణ గృహిణగా ఉండటం తనకెంతో ఇష్టమంది. ఆ ఇష్టంతోనే ఇంట్లో పిల్లల పనులు, భర్త పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుందిట. ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుందిట.
కానీ షూట్ ఉంటే మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. కనీసం సైఫ్ అలీఖాన్ తో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదంటోంది. సైఫ్ అలీఖాన్ రాత్రి షూటింగ్ ముగించుకుని వచ్చి పడుకునే సరికి తేల్లారిపోతుందిట. అయితే అప్పటికే కరీనా సెట్స్ లో ఉంటుందిట. వేకుమ జామునే లేచి జిమ్ కి వెళ్లడం అటుపై సెట్స్ కి వెళ్లడం వెంట వెంటనే జరిగిపోతాయి...ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ ముఖం చూడని రోజులు కూడా చాలా ఉన్నాయంటోంది.