మిర్రర్ క్వీన్ బెబో డబుల్ ధమాకా ట్రీట్
ఎప్పుడూ తనను తాను లైమ్ లైట్ లో నిలుపుకోవడం ఎలానో బెబో కరీనాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో!
By: Tupaki Desk | 2 Dec 2024 4:19 AM GMTఎప్పుడూ తనను తాను లైమ్ లైట్ లో నిలుపుకోవడం ఎలానో బెబో కరీనాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో! పటౌడీ క్వీన్ ఏ ఈవెంట్లో ఉన్నా అక్కడ హెడ్ టర్నర్ గా మారుతుంది. భారతదేశంలో తొలి జీరో సైజ్ బ్యూటీగా రికార్డులకెక్కిన బెబో ఫ్యాషన్ సెన్స్ అన్నివేళలా యూత్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు మరోసారి అవార్డుల వేడుకలో బెబో కేంద్రక ఆకర్షణగా మారింది. ఆదివారం రాత్రి జరిగిన అవార్డ్స్ ఈవెంట్ లో కరీనా లుక్ మైండ్ బ్లాక్ చేసింది.
ఫిలింఫేర్ OTT అవార్డ్స్ 2024లో కరీనా బ్యాక్ లెస్ గా కనిపించి మతులు చెడగొట్టింది. సభ్యసాచి కలెక్షన్ నుండి సిల్వర్ షిమ్మరీ తళుకుల చీరను ధరించిన బెబో కాంబినేషన్ బ్లౌజ్ తో ఫ్యాషన్ గేమ్ లో క్వీన్ అని నిరూపించింది. కరీనా దేశీ లుక్ ని వేదిక వద్ద ప్రశంసించని వారు లేరు. చీరలో ఆకర్షణీయమైన భంగిమలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల్లో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. @filmfare OTT అవార్డ్స్‌లో జానే జాన్ టునైట్‌ని ఉత్సాహపరిచేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అని సోషల్ మీడియాలో తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ పై నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. చంపుతోంది అంటూ ఒక అభిమాని ప్రశంసించగా, మీరు చాలా అద్భుతంగా ఉన్నారు అని ఒక నెటిజన్ రాశారు. మిర్రర్ లో క్వీన్ బెబో డబుల్ ట్రీట్ అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు.
కరీనా `జానే జాన్`లో తన పాత్రకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ నటిగా ఎంపికైంది. సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కీగో హిగాషినో రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల `డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్`కి అధికారిక అనువాద చిత్రం. ఈ సినిమాలో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్‌లతో కరీనా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
కరీనా జోరు మీదుంది. ఈ ఏడాది క్రూ, ది బకింగ్‌హామ్ మర్డర్స్, సింగమ్ ఎగైన్ చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.