బ్లాక్ డిజైన్ లో వైట్ మెరుపు మతి పోవాల్సిందే!
నవ నాయికలకు సైతం నా ముందు తగ్గాల్సిందే అంటుంది.
By: Tupaki Desk | 25 Oct 2024 1:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ఛామ్ గురించి చెప్పేదేముంది. 43 ఏళ్ల వయసులోనూ కరీనా కవ్వింపు పీక్స్ లోనే ఉంటుంది. టోన్డ్ బాడీ లుక్ లో ఎప్పటికప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. నవతరం నాయికలకు పోటీగా నిలుస్తుంది. జిమ్-యో గా వంటి ఫిట్ నెస్ చర్యలతో ఆఛామ్ ని కంటున్యూ చేయగల్గుతుంది. 40 ప్లస్ లోనూ ధగధగలాడిపోతుంది. నవ నాయికలకు సైతం నా ముందు తగ్గాల్సిందే అంటుంది.
తాజాగా అమ్మడు మరోసారి తళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ డిజైన్ లో కరీనా పాల నురుగల సౌందర్యం తో మిరుమిట్లు గొలుపుతోంది. వైట్ స్పాట్ లో కరీనా మరింత షైనింగ్ అవుతుంది. అమ్మడి మ్యాకప్, అలంకరణ, హెయిర్ స్టైల్ ప్రతీది మరింత అందంగా తీర్చి దిద్దాయి. వివిధ భంగిమల్లో కరీనా ఫోజులు చూస్తే అమ్మడు 40 ప్లస్ బ్యూటీనా అన్న సందేహం రావడం సహజం. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కరీనా అందానికి యువత ఫిదా అవుతుంది. ఈ పిక్ పై కరీనా మార్క్ కొటేషన్ విసిరింది. `క్షమించండి, నేను ఎంత అద్భుతంగా కనిపిస్తున్నానో? కానీ అది మీ మాటల్లో వినలేను` అంటూ రాసుకొచ్చింది. నెటి జనులు కామెంట్ బాక్స్ లో పోస్టులతో మరింత సెన్షేషన్ చేస్తున్నారు. లుక్స్ గార్జియస్, స్టన్నింగ్ క్వీన్, బ్లాక్ బ్యూటీ క్వీన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక కరీనా కెరీర్ సంగతి చూస్తే! బాలీవుడ్ కి ఎంత మంది భామలు దిగొచ్చినా అమ్మడికి పోటీ అనేదే లేదు. ఇటీవలే `ది క్రూ`తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. సినిమా మంచి లాభాలు తేవడంతో అదే కాంబినేషన్ మరో సినిమాకి సన్నాహాలు చేస్తోంది. అలాగే `సింగం ఎగైన్` లోనూ కరీనా కీలక పాత్ర పోషిస్తుంది. కాఫ్ స్టోరీలో కరీనా మార్క్ పడుతుందని అంచనాలున్నాయి.