Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సీన్స్‌పై కుండ బద్దలు కొట్టిన స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ సినిమాల్లో ఎప్పటి నుంచో రొమాంటిక్ సీన్స్‌ కామన్‌ అయ్యాయి. ముద్దు సీన్స్‌, బెడ్‌ రూం సీన్స్‌ ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువగా ఉండేవి.

By:  Tupaki Desk   |   12 March 2025 11:34 AM IST
రొమాంటిక్ సీన్స్‌పై కుండ బద్దలు కొట్టిన స్టార్‌ హీరోయిన్‌
X

బాలీవుడ్‌ సినిమాల్లో ఎప్పటి నుంచో రొమాంటిక్ సీన్స్‌ కామన్‌ అయ్యాయి. ముద్దు సీన్స్‌, బెడ్‌ రూం సీన్స్‌ ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువగా ఉండేవి. సౌత్ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సౌత్ సినిమాల్లోనూ రొమాంటిక్ సీన్స్ ఉంటున్నాయి. కొందరు ఆ సీన్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటే, కొందరు మాత్రం అలాంటి సీన్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్‌ గత కొంత కాలంగా రొమాంటిక్ సీన్స్‌కి, ముద్దు సీన్స్‌కి నో చెబుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సీన్స్ విషయంలో తన అభిప్రాయంను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చింది.

ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ... ఒక సినిమా కథలో రొమాంటిక్ సీన్‌ అవసరం అంటే నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కథలో దాన్ని బలవంతంగా ఇరికించే విధంగా మాత్రం ఉండవద్దని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇండియాలో ఇంకా శృంగారం విషయంలో రహస్యం, గోప్యతను మెయింటెన్ చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు రొమాంటిక్ సీన్ అనగానే ఏదో తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు. ఇండియన్స్ ఇంకా ఈ విషయంలో ఓపెన్‌గా ఆలోచించడం లేదు. అందుకే కొందరు సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే కచ్చితంగా విమర్శలు చేస్తుంటారు. అంతే కాకుండా చాలా మంది రొమాంటిక్ సీన్స్ విషయంలో తప్పులను వెతికే పని పెట్టుకుంటారని కరీనా అన్నారు.

నటీ నటులు రొమాంటిక్ సీన్‌లో కష్టపడి నటించినా దాన్ని ప్రేక్షకులు గుర్తించే తీరు బాగుండటం లేదు. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఎంత ఉందని తాను ఆలోచిస్తుంటాను అంది. ఇండియాలో రొమాంటిక్ సన్నివేశాలను మరో అర్థం వెతికి మరీ అర్థం చేసుకుంటున్నారు. తద్వారా తప్పుడు వ్యాఖ్యలు చేయడం, ఆ సన్నివేశాలపై విమర్శలు చేయడం మనం చూస్తూ ఉంటామని, అందుకే కథలో అత్యంత కీలకం అయితే తప్ప అలాంటి సన్నివేశాలు సినిమాలో ఉండక పోవడం మంచిది అనే అభిప్రాయంను కరీనా కపూర్‌ తనదైన శైలిలో చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈమధ్య కాలంలో కమర్షియల్‌ హీరోయిన్స్‌గా రాణించాలంటే స్కిన్‌ షో చేయడంతో పాటు, రొమాంటిక్‌ సీన్స్‌లో నటించాల్సి ఉంటుంది. ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్తేనే కమర్షియల్‌ హీరోయిన్స్‌గా ఆఫర్లు వస్తున్న ఈ రోజుల్లో కరీనా కపూర్‌ రొమాంటిక్ సీన్స్ అవసరం ఉంటేనే పెట్టాలంటూ వాదించడం విడ్డూరంగా ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో అలాంటి సీన్స్‌లో నటించే అవకాశం లేదా అంటూ కరీనాను ప్రశ్నించిన సమయంలో కథను ముందుకు తీసుకు వెళ్లడానికి శృంగార సన్నివేశం ఒక్కటే ముఖ్యం కాదు. కానీ తప్పనిసరిగా అక్కడ ఆ సీన్ అవసరం అనిపిస్తే నటించేందుకు సిద్ధంగానే ఉన్నాను అంటూ చాలా కాలం తర్వాత రొమాంటిక్ సీన్స్‌కు ఓకే చెప్పినట్లుగా వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయి, తల్లిగా మారిన తర్వాత కరీనా కపూర్‌తో అలాంటి సీన్స్‌ను ఏ దర్శకుడు అయినా ప్లాన్‌ చేస్తాడా అనేది చూడాలి.