Begin typing your search above and press return to search.

టాప్ హీరోయిన్ చెంప చెల్లుమ‌నిపించిన ఈ న‌టి ఎవ‌రో తెలుసా?

ఆమె త‌ల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఈ ఘ‌ట‌న‌లో చెంప దెబ్బ తిన్న అగ్ర క‌థానాయిక త‌న‌ను కొట్టిన ఆమె భ‌ర్తతోను స‌మ‌స్య ఏర్ప‌డింది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 7:30 AM GMT
టాప్ హీరోయిన్ చెంప చెల్లుమ‌నిపించిన ఈ న‌టి ఎవ‌రో తెలుసా?
X

ఆమె జ‌న్మ‌తః ధ‌న‌వంతురాలు. ఆలియా భ‌ట్, దీపిక ప‌దుకొనే కంటే ధ‌న‌వంతురాలు ఈ న‌టి. కాస్త పొగ‌రు ఒగ‌రు ఎక్కువే. కార‌ణం ఏదైనా సెట్స్ లో త‌లెత్తిన ఓ వివాదంలో ప్ర‌ముఖ క‌థానాయిక చెంప చెల్లుమ‌నిపించింది. ఆమె త‌ల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఈ ఘ‌ట‌న‌లో చెంప దెబ్బ తిన్న అగ్ర క‌థానాయిక త‌న‌ను కొట్టిన ఆమె భ‌ర్తతోను స‌మ‌స్య ఏర్ప‌డింది. ఈ వివాదం స‌ద్దుమ‌ణిగినా కానీ చాలా కాలం పాటు, అగ్ర హీరోయిన్ ని చెంప చెల్లుమ‌నిపించిన హీరోగారి భార్య బాలీవుడ్ లో ట్రెండీ టాపిగ్గా మారింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో చెంప దెబ్బ తిన్న అగ్ర హీరోయ‌న్ క‌రీనా క‌పూర్. త‌న చెంప చెల్లుమ‌నిపించిన ఆ న‌టి బాబీ డియోల్ భార్య తాన్య డియోల్. జ‌న్మ‌తః స్పీడ్ ఉన్న తాన్య‌.. ఆన్ లొకేష‌న్ క‌రీనాక‌పూర్, ఆమె త‌ల్లి బ‌బితా ఇద్ద‌రినీ చెడామ‌డా చెరిగేసింద‌ని ముచ్చ‌టించుకున్నారు.

బాబీ డియోల్ భార్య తాన్యా డియోల్ అంత‌గా ప‌బ్లిక్ దృష్టిలో లేరు. ఆమె ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ కు దూరంగా ఉండ‌టానికి ఇష్టపడుతుంది. తన భర్తతో అప్పుడ‌ప్పుడు ఈవెంట్లలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. తాన్యా డియోల్ దివంగత బ్యాంకర్ దేవేంద్ర అహుజా కుమార్తె. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైన‌ర్ కం ఇంటీరియర్ డిజైనర్. ఆమె ఒక వ్యాపారవేత్త.. ది గుడ్ ఎర్త్ అనే కంపెనీని నిర్వ‌హిస్తున్నారు. అలాగే బాబీ - తాన్యల ప్రేమకథ బాలీవుడ్ సినిమా రేంజుకు త‌గ్గ‌ద‌ని చెబుతారు. ధ‌ర్మేంద్ర వార‌సుడైన డియోల్ తాన్యతో ప్రేమలో పడ్డాడు. వారి రిలేష‌న్ బ‌ల‌ప‌డిన త‌ర్వాత‌.. బాబీ - తాన్య 19 సంవత్సరాల వయసులో 30 మే 1996న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆర్యమాన్ - ధరమ్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. బాబీ అనే పేరు సినీ పరిశ్రమలో అంతగా పాపుల‌ర్ కాని రోజుల్లోనే తాన్య అతడికి మద్దతు ఇచ్చిందని, కష్ట సమయాల్లో అతడి బలం అయ్యిందని కూడా చెబుతారు. తాన్య ఏకంగా రూ. 300 కోట్ల ఆస్తిప‌రురాలు. బాబీ డియోల్ నికర ఆస్తి రూ. 70 కోట్లు కాగా, అంత‌కంటే 10రెట్లు తాన్య ఆస్తి ఎక్కువ‌. ఇద్దరూ ముంబైలోని విలే పార్లేలో నివసిస్తున్నారు. వారి ఇంటి ధర కోట్ల‌లో ఉంటుంది.

అయితే 2000ల ప్రారంభంలో తాన్య - కరీనా మధ్య గొడవ జరిగిందని మీడియాలో గుస‌గుసలు వినిపించాయి.. క‌రీనా `అజ్నబీ` సినిమా షూటింగ్‌లో ఉంది. కానీ తాన్య సీనియ‌ర్ న‌టిని కాద‌ని, పరిశ్రమకు కొత్తగా వచ్చిన బిపాసా బసుకు మద్దతుగా నిలిచింది. అజ్నబీ కోసం బిపాసాకు దుస్తులలో తాన్య(డిజైన‌ర్) సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది కరీనా తల్లి బబితకు నచ్చలేదు. బబిత తాన్య వద్దకు వెళ్లి బిపాసాకు దుస్తులలో సహాయం చేయ‌డానికి డ‌బ్బు తీసుకుంద‌ని ఆరోపించారు. బబిత తన వద్ద మాట్లాడిన‌ తీరు తాన్యకు నచ్చలేదు. ఆమెకు తగిన సమాధానం ఇచ్చింది. దాంతో కోపంలో కరీనా నేరుగా తాన్యతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె ప్రశాంతతను కోల్పోయింది. ఆ స‌మ‌యంలో కోపంతో తాన్య కరీనాను చెంపదెబ్బ కొట్టిందని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఆమె ఎప్పుడూ ఈ వివాదం గురించి మాట్లాడలేదు. తాన్య‌తో స‌మ‌స్య‌లున్నాయ‌ని క‌రీనా ఆ త‌ర్వాత వ్యాఖ్యానించింది. కానీ బాబీతో నా సమస్యలను పరిష్కరించుకోగలనని క‌రీనా పేర్కొంది.

నిజానికి తన తొలి చిత్రం `బర్సాత్`తో బాబీ ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ గా మారినా కానీ, అత‌డు ఇండ‌స్ట్రీలో పోటీని తట్టుకోలేకపోయాడు. అత‌డి స్థానంలో చాలా సినిమాల‌కు కొత్తవారిని తీసుకున్నారు. దాంతో కెరీర్ రేసులో వెన‌క‌బ‌డ్డాడు. యానిమల్ చిత్రంతో బాబి కంబ్యాక్ అయ్యాడు. త‌న భార్య తాన్య అండ‌దండ‌ల‌తో మాత్ర‌మే అత‌డు బాలీవుడ్ లో ఎదురీద‌గ‌లిగాన‌ని నిజాయితీగా అంగీక‌రించాడు.