Begin typing your search above and press return to search.

రాజ‌కీయ నాయ‌కుడితో న‌టి డేటింగ్ ప్లాన్

క‌రీనా మాత్రం త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద‌వాడైన హీరో సైఫ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ప్ర‌స్తుతం ఈ జంట‌కు పిల్ల‌లు ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 March 2025 6:30 AM
Kareena interesting moments
X

ప్ర‌ముఖ క‌థానాయిక క‌రీనా క‌పూర్ ఎఫైర్లు అభిమానుల‌కు తెలియ‌నివి కావు. ఒక‌రికి మించి హీరోల‌తో డేటింగ్ చేసింద‌నే పుకార్లు ఉన్నాయి. అయితే పాపుల‌ర్ హీరో షాహిద్ క‌పూర్ తో సుదీర్ఘ కాలం డేటింగ్ చేసాక‌, పెళ్లికి టైమొచ్చిద‌ని అనుకుంటుండ‌గానే బ్రేక‌ప్ అయింది. ఆ హీరో వేరొక‌రిని పెళ్లాడి సెటిల‌య్యాడు. క‌రీనా మాత్రం త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద‌వాడైన హీరో సైఫ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ప్ర‌స్తుతం ఈ జంట‌కు పిల్ల‌లు ఉన్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో క‌రీనా త‌న డేటింగ్ లిస్ట్ లో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి పేరు ఉన్న‌ట్టు రివీల్ చేసి షాకిచ్చింది. త‌న‌ జీవితంలో ఒకానొక‌ దశలో రాజకీయ నాయకుడిపై ప్రేమ పుట్టి అతనితో డేటింగ్ చేయాలని కోరుకున్నాన‌ని తెలిపింది. పాపుల‌ర్ టీవీ షో `రెండెజౌస్ విత్ సిమి గ్రేవాల్` త్రోబ్యాక్ ఎపిసోడ్ లో తన మనసులోని మాటను బయటపెడుతూ దీనిని లీక్ చేసింది. ఇంత‌కీ ఎవ‌రా రాజ‌కీయ నాయ‌కుడు? అంటే .. అత‌డు కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ.

షోలో హోస్ట్ క‌రీనాను ఇలా ప్ర‌శ్నించారు. ప్రపంచంలో ఎవరితోనైనా డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడిగినప్పుడు బెబో ఇలా సమాధానమిచ్చింది. నేను చెప్పాలా వద్దా? ఇది కొంచెం వివాదాస్పదంగా ఉండొచ్చు.. కానీ నేను రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను! అని తెలిపింది క‌రీనా. నేను అత‌డి గురించి రెగ్యుల‌ర్ గా తెలుసుకోవాల‌నుకుంటాను. నేను సినిమా కుటుంబం నుండి వచ్చాను. అతడు రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. కాబట్టి మా మ‌ధ్య‌ ఆసక్తి పుట్ట‌డానికి ఆస్కారం ఉంది.. అని తెలిపింది. ఆ త‌ర్వాత మ‌రో ఇంట‌ర్వ్యూలో నాటి ప్ర‌క‌ట‌న గురించి ప్ర‌శ్నించ‌గా, మా ఇంటిపేర్లు బాగా తెలిసినవి కాబట్టి నేను అలా చెప్పాను! అని క‌రీనా అంది.

కరీనా 2012లో త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద‌వాడైన‌ సైఫ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2016లో వారి మొదటికుమారుడు తైమూర్‌ను, ఆ తర్వాత 2021లో జెహ్‌ను స్వాగ‌తించారు. క‌రీనా, సైఫ్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్నారు.