Begin typing your search above and press return to search.

పింక్ బ్యూటీలో బెబో గుభాళింపు!

తాజాగా క‌రీనా పింక్ అందం గుభాళింపుతో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తుంది. అమ్మ డు గులాబీ అందంలో ఓరేంజ్ లో గుభాళించేస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 1:30 AM GMT
పింక్ బ్యూటీలో  బెబో గుభాళింపు!
X

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామ‌ర్ ఛామ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టోన్డ్ బాడీ లుక్ లో ఎప్పటికప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. నవతరం నాయికలకు పోటీగా నిలుస్తుంది. నిత్యం జిమ్-యో గా వంటి ఫిట్ నెస్ చర్యలతో ఆఛామ్ ని కంటున్యూ చేయగల్గుతుంది. క‌పూర్ బ్యూటీ స్పూర్తితో ఐశ్యర్యారాయ్ లాంటి వాళ్లు ప్రయత్నించినా ప‌న‌వ్వ‌లేదు.


కరీనా లెక్క వేరే అని! అమ్మ‌డు 40 ప్లస్ లోనూ ధగధగలాడిపోతుంది. న‌వ నాయిక‌ల‌కు సైతం నా ముందు త‌గ్గాల్సిందే అంటుంది. తాజాగా క‌రీనా పింక్ అందం గుభాళింపుతో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తుంది. అమ్మ డు గులాబీ అందంలో ఓరేంజ్ లో గుభాళించేస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు. టాప్ టూ బాట‌మ్ ఒకే డిజైన్ లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మ్యాచింగ్ హై హీల్స్ అమ్మ‌డి హైట్ ని మ‌రింత పెంచేసాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. క‌రీనా అందానికి అభిమానులు అంతే ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో హాట్ హాట్ కామెంట్ల తో గుప్పిస్తున్నారు. ఇక క‌రీనా కెరీర్ సంగ‌తి చూస్తే! బాలీవుడ్ కి ఎంత మంది భామ‌లు దిగొచ్చినా అమ్మ‌డికి పోటీ అనేదే లేదు. ప్ర‌సుతం అక్క‌డ మూడు.. నాలుగు సినిమాలు చేస్తోంది.

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత రిలీజ్ అయిన లాల్ సింగ్ చ‌డ్డా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ గ్యాప్ ను పుల్ ఫిల్ చేసే క‌మిట్ మెంట్ల జోరు పెంచుతుంది. ఈ క్ర‌మంలో ఇదే ఏడాది మూడు సినిమాలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేలా ప్ర‌ణాళిక సిద్దం చేసింది. అలాగే ఈబ్యూటీని తెలుగులో కి తీసుకురావాల‌ని కొంత మంది ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.