అలాగైతే కరీనా పారితోషికంలో మినహాయింపు!
రెగ్యులర్ కమర్శియల్ సినిమాలకు భిన్నంగా అదనంగా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు అదనంగా ఛార్జ్ చేస్తుంది.
By: Tupaki Desk | 23 July 2024 2:30 PM GMTబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న కరీనా కపూర్ రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 40 ఏళ్లు దాటినా అమ్మడి ఇమేజ్ ఎక్కడా కింగ లేదు. బ్యూటీ విషయంలో నవ నాయికలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ పడుతుంది. అవకాశాల పరంగా వాళ్లనే మించిపోతుంది. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు సైతం చేస్తోంది. అందుకుగాను ప్రత్యేకంగా పారితోషికం అందుకుంటుంది. రెగ్యులర్ కమర్శియల్ సినిమాలకు భిన్నంగా అదనంగా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు అదనంగా ఛార్జ్ చేస్తుంది.
ఇటీవల రిలీజ్ అయిన క్రూత్ కరీనా మార్కెట్ మరింత రెట్టింపు అయింది. దీంతో అమ్మడిపై నిర్మాతలు కోట్టు గుమ్మరించడానికి రెడీ గా ఉన్నారు. అందుకు మరో కారణం కూడా ఉంది. 40 ఏళ్లు దాటినా కరీనా హాట్ అప్పిరియన్స్ లో ఏమాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోవడం ఓ కారణం. నవ నాయికలకు సైతం చేయని సాహసాల్ని అమ్మడు ఎంతో డేరింగ్ తో చేస్తుంది. అందుకే కరీనా మార్కెట్ లో ఓ బ్రాండ్ గా ఇప్పటికీ కొనసాగుతుంది.
అయితే కొన్ని సినిమాల విషయంలో కరీనా కపూర్ సామాజిక దృక్కోణంలో ఆలోచన చేస్తున్నట్లు తాజాగా రివీల్ చేసింది. `అన్ని సినిమాలకు పారితోషికం ఒకే రకంగా తీసుకోను. బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషిం తీసుకుంటున్న హీరోయిన్లలో నేను ఒకరుగా ఉన్నాను. కానీ పారితోషికం దృష్టిలో ఉంచుకుని కథల్ని ఎంచుకోను. ఇది నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం. సినిమా ఎలాంటింది? అందులో నా పాత్ర ఎలా ఉంటుంది? అలోచిస్తాను.
అలాగే ప్రేక్షకులకు ఎంతో కొంత సందేశం ఇస్తూ , సమాజంపై సినిమా ప్రభావం చూపించేలా ఉంటే? కచ్చితంగా తక్కువ పారితోషికంతోనే ఆ సినిమా చేస్తాను. ఆ విషయంలో రూపాయి తగ్గినా నేను పెద్దగా పట్టించుకోను. నాద్వారా సమాజానికి మంచి విషయం వెళ్తుందంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటాను` అని తెలిపింది.