Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ క్లోజ్ ప్రెండ్ ఆవిడేనా?

అంద‌రికీ స్నేహితులుంటారు. కానీ అందులో ముఖ్య‌మైన వారు ..దిబెస్ట్ అనిపించుకునే స్నేహితులు ఒక‌రిద్ద‌రు ఉంటారు.

By:  Tupaki Desk   |   25 July 2024 8:30 AM GMT
ఆ బ్యూటీ క్లోజ్ ప్రెండ్ ఆవిడేనా?
X

అంద‌రికీ స్నేహితులుంటారు. కానీ అందులో ముఖ్య‌మైన వారు ..దిబెస్ట్ అనిపించుకునే స్నేహితులు ఒక‌రిద్ద‌రు ఉంటారు. మ‌రి అలాంటి వాళ్ల‌లో క‌రీనా కపూర్ ఖాన్ క్లోజ్ ప్రెండ్ ఎవ‌రు? అంటే బాలీవుడ్ నిర్మాత, ఫ్యాష‌న్ డిజైన‌ర్ రియా క‌పూర్ అని తెలుస్తోంది. అమ్మ‌డు స్నేహితురాలి గురించి ఎంత గొప్ప గా చెప్పిందంటే? ఆ మాట‌ల మాధుర్యంలోనే రియా త‌న‌కోంత క్లోజ్ అన్న‌ది అద్దం ప‌డుతుంది.


`రియా నా క‌న్నా చిన్న‌దైనా ఎంతో తెలివైన‌ది. ఎంతో నిజాయితీగా ఉంటుంది. ఆమె ఆలోచ‌న‌లు అసాధార‌ణంగా ఉంటాయి. రెగ్యుల‌ర్ కి భిన్నంగా ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. త‌న‌లో ఆ ల‌క్ష్మ‌ణ‌మే ఫ్యాష‌న్ డిజైనింగ్ వైపు తీసుకెళ్లింది. మేము తెలిసో తెలియ‌కో కొన్ని విషయాలు నిజ‌మ‌ని న‌మ్మేస్తాం. కానీ వాటి విష‌యంలో ఎంతో లోతుగా ఆలోచించి నిజ నిర్దార‌ణ చేసుకోవ‌డంతో తానో స్పెష‌లిస్ట్.

త‌ప్పును నిర్మొహమాటంగా త‌ప్పని ఖండిస్తుంది. త‌న‌లో ఆ ల‌క్ష‌ణం నాకెంతో న‌చ్చుతుంది. వ్య‌క్తిగ‌తంగా రియాని అంత‌గా ఇష్ట‌ప‌డు తున్నానంటే అదే కార‌ణం అవ్వొచ్చు. ఆమె నాజీవితంలో అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి. నా ప్ర‌తి విష‌యంలోనే ఆమె ఉంటుంది` అని తెలిపింది. రియాక‌పూర్ ..క‌రీనా క‌పూర్ తో రెండు సినిమాలు కూడా నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

ఆరేళ్ల క్రితం `వీర్ ది వెడ్డింగ్` చిత్రం నిర్మించింది. ఈసినిమా మంచి విజ‌యం సాదించింది. 40 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 140 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇటీవ‌ల విడుదలైన `దిక్రూ` చిత్రాన్ని కూడా రియా క‌పూర్ నిర్మించింది. 70 కోట్ల లో నిర్మించిన సినిమా 100 కోట్ల లాభాలు తెచ్చి పెట్టింది. అలా ఈ కాంబినేష‌న్ కి ఇంత‌వ‌ర‌కూ తిరుగులేదు. రెండు విజ‌యాలు అందుకున్న నేప‌థ్యంలో హ్యాట్రిక్ భారీగా ప్లాన్ చేసే అవ‌కాశం ఉంది.