వైఫ్ సిస్టరొస్తే హబ్బీ బిగుసుకుపోతాడా?
సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 July 2024 1:30 AM GMTసైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి ప్రేమకి కానుకగా ఇద్దరు బిడ్డలు కలరు. ఇరువురు ప్రోఫెషనల్ గా ఎంతో బిజీగా ఉంటారు. బాలీవుడ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లతో కరీనా బిజీగా ఉంటే...సైఫ్ అలీఖాన్ కొత్తగా టాలీవుడ్ సినిమాలు కూడా కమిట్ అవ్వడంతో మరింత బిజీగా మారాడు. ఈ నేపథ్యంలో తాజాగా కరీనా తన ఫ్యామిలీ లైఫ్ గురించి రివీల్ చేసింది.
`వివాహం నన్నెంతో మార్చేసంది. బాద్యతగా ఉండటం అలవాటు చేసింది. ఒకరికొకరు తినిపించుకునే వాళ్లం..పోట్లాడుకునే వాళ్లం. కానీ మాకంటూ సమయం మాత్రం కేటాయించుకోలేకపోతున్నాం. సైఫ్ ఉదయం నాలుగున్నరకు నిద్రపోయేవాడు. తను లేచే సరికి నేను షూటింగ్ కి వెళ్లిపోతాను. నేని తిరిగొచ్చే సరికి తను ఉండేవాడు కాదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు.
నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన నా సినిమాలు చూడడు. ఇప్పటివరకూ `క్రూ `సినిమా చూడలేదు. ఇక ఇద్దరికీ ఏసీ దగ్గర గొడవొస్తుంది. తనకి కూలింగ్ ఎక్కువ కావాలి. నాకు తక్కువ కావాలని 20 డిగ్రీలు పెడతాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీలు సెట్ చేసాం. నా సొదరి కరీష్మా కపూర్ వచ్చినప్పుడు మాత్రం ఏసీ 25 లో ఉంటుంది. అప్పుడు తనకంటే నేనే బెటర్ అని పీలవుతాడు.
అలాగే టైమ్ విషయంలోనూ గొడవ పడతాం. డబ్బు, బంగారు కోసం ఎప్పుడూ చర్చ రాదు. కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలు అనుకుంటాం. సమయం దొరికితే కలిసి ఉండాలని ఆరాటపడతాం` అని అన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ `దేవర` లో విలన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు `ఆదిపురుష్` లోనూ విలన్ పాత్ర పోషించాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధింలేదు.