కరీనా పెద్ద కొడుకు దబాయిస్తాడా?
స్టార్ హీరోయిన్లు ఎంత బిజీగా ఉంటారో? చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈ మధ్య కాలంలో పెళ్లైన హీరోయిన్లు ఇంకా బిజీగా ఉంటున్నారు
By: Tupaki Desk | 6 May 2024 3:15 AM GMTస్టార్ హీరోయిన్లు ఎంత బిజీగా ఉంటారో? చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈ మధ్య కాలంలో పెళ్లైన హీరోయిన్లు ఇంకా బిజీగా ఉంటున్నారు. డిమాండ్ కూడా ఎక్కువగా వాళ్లకే ఉంటుంది. సీనియర్ భామలైనా..పెళ్లైనా..తల్లులైనా వారికి మరింత డిమాండ్ గా ఉంటున్నారు. రకరకాల షూటింగ్ లతో వాళ్ల షెడ్యూల్ ఎంతో బిజీగా ఉంటుంది. ఒకేసారి మూడు షిప్ట్ లు సైతం పనిచేసే హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. కరీనా కపూర్ ఖాన్ కూడ చాలా కాలం అలా పనిచేసింది.
ఇప్పుడు కూడా అవసరమైతే అలాగే కమిట్ మెంట్ ఇస్తుంది. అందుకే అన్ని సినిమాలు చేయగలగింది. అయితే పెళ్లైన తర్వాత భర్త నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా...పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్ నుంచి మాత్రం ఇబ్బంది తప్పడం లేదంటోంది. అమెరికా..దుబాయ్ షూటింగ్ కోసం వెళ్తున్నప్పుడు! ఎప్పుడూ విదేశాలే తిరుగుతావ్...మాతో ఉండవేంటి? అని అడుగుతాడుట. ఆ సమయంలో కరీనా మనసు జివ్వుమంటుందిట. కుమారుడు ఎంతో బావోద్వేగంతో అలా అడిగాడని బాధపడుతుందిట.
వెళ్లడం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్తుందిట. ఒక్కోసారి కోపంతో దబాయింపుకు పాల్పడుతాడటు. ఈరోజు వెళ్లోద్దు. తర్వాత వెళ్లు అని అదేశిస్తాడుట తైమూర్. మొత్తానికి భర్త సైఫ్ అలీఖాన్ తో ఇబ్బంది లేదు గానీ తైమూర్ అరుపులకు మాత్రం కరీనా భయపడుతుందని చెప్పొచ్చు. తైమూర్ కి ఓ తమ్ముడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కుమారుల పేర్ల విషయంలో కరీనాజోడీ కొన్ని రకాల విమర్శలు కూడా ఎదుర్కున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే లేచింది. ఈ విషయంలో కరీనా-సైఫ్ కూడా వెనక్కి తగ్గలేదు.
ఇక కరీనా వృత్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో బ్రాండ్ హీరోయిన్ . ఇటీవలే `ది క్రూ`తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం గా రిలీజ్ అయిన సినిమా మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం `సింగం ఎగైన్` లో నటిస్తోంది. ఈసినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే అమ్మడు కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు కమిట్ అయింది. వాటి వివరాలు త్వరలోనే అధికారికంగా రివీల్ చేయనుంది.