బాధలో హీరో ..ఓదార్చినా కరీనా
కానీ లాల్ సింగ్ చడ్డా ఆశించిన ఫలితం సాధించలేదు. ఆసినిమా ప్లాప్ తర్వాత అమీర్ ని ఓ ఫంక్షన్ లో కలిసాను. ఆవేడుకలో ఆయన చాలా నిరాశగా కనిపించారు.
By: Tupaki Desk | 15 Oct 2023 3:30 AM GMTమిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్-కరీనాకపూర్ ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులు. ఆ ఇద్దరు జంటగా నటించిన '3 ఇడియట్స్'.. 'తలాష్' లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీంతో ఆ కాంబినేషన్ అంటే బాలీవుడ్ లో క్రేజీగా మారింది. అయితే ఇదే కలయికలో తెరకెక్కిన 'లాల్ సింగ్ చడ్డా' మాత్రం ఘోర పరాజయాన్ని చూసింది.
ఈ సినిమాపై అమీర్ చాలా ఆశలు పెట్టు కున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగాను చిత్రాన్ని భావించారు. భారీ కాన్సాస్ పై చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగచైతన్య లాంటి స్టార్ ని తన సినిమాలో పెట్టుకున్నారు. కానీ సినిమా ఫలితం తీవ్ర నిరాశని మిగిల్చింది. అమీర్ కెరీర్ లోనే ఓ చేదు అనుభవంగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో అమీర్ ఖాన్ ఎంతగా బాధపడ్డారో కరీనా కపూర్ మాటల్లో తెలుస్తుంది.
ఈ సినిమా వైఫల్యం గురించి కరీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అమీర్ ..నేను నటించిన గత రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ లాల్ సింగ్ చడ్డా ఆశించిన ఫలితం సాధించలేదు. ఆసినిమా ప్లాప్ తర్వాత అమీర్ ని ఓ ఫంక్షన్ లో కలిసాను. ఆవేడుకలో ఆయన చాలా నిరాశగా కనిపించారు. నాకు క్షమాపణలు కూడా చెప్పారు. నన్ను నమ్మి సినిమా చేసినందుకుగానూ అందుకు కృతజ్ఞత భావంగా ఆయన క్షమాపణలు అడిగారు.
ఆ క్షణంలో నాకెంతో బాధగా అనిపించింది. మనం ఒడిపోయినట్లు భావించి నువ్వు బాధపడకు. మనం ఓ అందమైన చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై మన స్నేహం ఆధారపడదు. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అంటూ ఇంటికొచ్చాక సందేశం పంపించాను' అంది.
సరిగ్గా ఇదే తరహలో తలపతి విజయ్ కూడా ఈ మధ్య స్పందించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ చేసిన 'బీస్ట్' ఘోర పరాజయం తర్వాత నెల్సన్ బాధని చూసి విజయ్ మన స్నేహం సినిమా ఫలితంతో సంబంధం లేనిది. మరో మంచి సినిమా చేద్దాం' అని ఓదార్చారు.