పీసీతో గొడవల్లేవ్...కానీ బెస్ట్ విషయంలో
తాజాగా రెండు దశాబ్ధాల తర్వాత కరీనా కపూర్ ఈ వివాదంపై స్పందించింది. 'ప్రియాంకతో నాకెలాంటి గొడవలు లేవు.
By: Tupaki Desk | 14 Oct 2023 2:50 PM GMTకరీనా కపూర్-ప్రియాంక చోప్రా మధ్య ఒకప్పుడు ఎంత పోటీ ఉండేదో? తెలిసిందే. సినిమాల విషయంలో ఇద్దరి మధ్య తగ్గాప్ వార్ నడిచేది. పోటీ పడి అవకాశాలు..విజయాలు అందుకునే వారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ఇద్దరి మధ్య మంచి పోటీ కనిపించేది. అయితే 2004 లో ఇద్దరు 'ఐత్రాజ్' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఆ సినిమా నాటి నుంచి ఇద్దరి మధ్య అస్సలు పొసగదని..పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదం ముదిరిందని బాలీవుడ్ వాతావరణం అంతకంతకు వెడెక్కించింది. ఇద్దరి మధ్య కొట్లాట కూడా జరిగిందని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఏనాడు కరీనాగానీ..పీసీ గాని స్పందించలేదు. తాజాగా రెండు దశాబ్ధాల తర్వాత కరీనా కపూర్ ఈ వివాదంపై స్పందించింది. 'ప్రియాంకతో నాకెలాంటి గొడవలు లేవు.
ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు. అప్పటి మీడియాలో వచ్చినవన్నీ అవాస్తవాలే. ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే ఉండేది. కెరీర్ లో ఇద్దరు బెస్ట్ గా ఉండేదుకు ఒకరికొకరం పోటీ పడేవాళ్లం. నటన విషయంలో పోటీ పడి నటించే వాళ్లం. అంతకు మించి ఇద్దరి మధ్య కొట్టుకునేంత గొడవలు లేవని' నవ్వేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోయి గ్లోబల్ స్టార్ అయిపోయింది.
కెరీర్ ని అక్కడే ప్లాన్ చేసుకుని ముందుకెళ్తుంది. నిక్ జోనాస్ తో వివాహం తర్వాత మకాం న్యూయార్క్ మార్చేసింది. చాలా కాలంగా ఇండియా కూడా రావడం లేదు. కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్నా! ఫోన్ పలకరింపులతోనే సరిపెడుతుంది. ఇక కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడి సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది.