Begin typing your search above and press return to search.

మండు వేస‌విలో మ‌రిగిస్తున్న బెబో

బెబో తాజాగా ఇన్‌స్టాలో ఆకర్షణీయమైన ఫోటోషూట్‌ని షేర్ చేసింది. వివియెన్ వెస్ట్‌వుడ్ ఆఫ్-షోల్డర్ షిమ్మరీ గౌను ధరించిన‌ కరీనా టూ హాట్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 4:07 AM GMT
మండు వేస‌విలో మ‌రిగిస్తున్న బెబో
X

ఫ్రీస్ట‌యిల్‌లో న‌టించ‌డమే కాదు ఫ్రీస్ట‌యిల్‌లో బౌన్స‌ర్లు వేయ‌డంలోను బెబో క‌రీనా త‌ర్వాతే. ఫోటోషూట్ల‌లో చెల‌రేగిపోవ‌డంలో ఈ సీనియ‌ర్ బ్యూటీని కొట్టేవాళ్లే లేరు. పెద్ద తెర‌పై వేడెక్కించే పాత్ర‌ల్లో జీవించే ఈ బ్యూటీ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ప్ర‌ఖ్యాత బ‌ల్గారీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సంత‌కం చేసిన‌ప్ప‌టి నుంచి బెబోలో ఈ స్ప‌ష్ఠ‌మైన మార్పు క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల బ‌ల్గారీ పెర్ఫ్యూమ్ లాంచ్‌లో కరీనా కపూర్ ఖాన్ వివియెన్ వెస్ట్‌వుడ్ గౌనులో గుబులు రేపారు. బ‌ల్గారీకి చెందిన‌ హై-ఎండ్ పెర్ఫ్యూమ్ కలెక్షన్ లాంచ్‌లో మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనతో షో స్టాప‌ర్‌గా నిలిచింది. ఇంటర్నెట్‌లో బెబో కొత్త అవ‌తారం పెను సంచ‌ల‌నంగా మారింది.

బెబో తాజాగా ఇన్‌స్టాలో ఆకర్షణీయమైన ఫోటోషూట్‌ని షేర్ చేసింది. వివియెన్ వెస్ట్‌వుడ్ ఆఫ్-షోల్డర్ షిమ్మరీ గౌను ధరించిన‌ కరీనా టూ హాట్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్టైల్ వెన‌క సోన‌మ్ క‌పూర్ సోద‌రి ఫ్యాష‌న్ డిజైన‌ర్ రియా కపూర్ కృషి దాగుంది. ఈ డిజైన‌ర్ స్ట్రాప్‌లెస్ గౌనులో కెమెరాలకు పోజులిచ్చేటప్పుడు క‌రీనా కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారింది. బెబో అంద‌చందాలు ఇంట‌ర్నెట్‌లో మ‌తులు చెడ‌గొట్టాయి.

ఈ ఫోటోషూట్ పై క‌రీనా త‌న‌దైన శైలిలో స్పందించింది. ''BVLGARI అత్యద్భుతమైన సువాసనల‌తో పెర్ఫ్యూమ్ ల శ్రేణి లాంచ్ కోసం ఈరోజు ఇక్కడకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను... ఇటలీ - BVLGARI మాస్టర్ హస్తకళా నైపుణ్యం .. సంపూర్ణ సమ్మేళనం. నాకు ఇష్టమైన బ్రాండ్ ల‌లో ఇది ఒక‌టి. కలకాలం.. గాంభీర్యాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. నాదైన సిగ్నేచ‌ర్ మార్క్ సువాసనను కనుగొనడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కరీనా ప్రస్తుతం 'క్రూ' విజయాన్ని ఆస్వాధిస్తోంది. కృతి సనన్, టబుతో క‌లిసి పెద్ద తెర‌పై క‌రీనా మాయాజాలం ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. రాజేష్ ఎ కృష్ణన్ తెర‌కెక్కించిన క్రూ విమానయాన పరిశ్రమ నేపథ్యంలో ముగ్గురు మ‌హిళా ఉద్యోగుల జ‌ర్నీ నేప‌థ్యంలో అద్భుత స‌న్నివేశాల‌తో ర‌క్తి క‌ట్టించింది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ, శాశ్వత ఛటర్జీ, రాజేష్ శర్మ, కులభూషణ్ ఖర్బందా కూడా నటించారు.