Begin typing your search above and press return to search.

కాక పుట్టించిన క‌రీనా..సెగ‌లు పొగ‌లే!

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామ‌ర్ ఛామ్ గురించి చెప్పేదేముంది.

By:  Tupaki Desk   |   8 July 2024 11:30 AM GMT
కాక పుట్టించిన క‌రీనా..సెగ‌లు పొగ‌లే!
X

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామ‌ర్ ఛామ్ గురించి చెప్పేదేముంది. 43 ఏళ్ల వ‌య‌సులోనూ క‌రీనా క‌వ్వింపు పీక్స్ లోనే ఉంటుంది. టోన్డ్ బాడీ లుక్ లో ఎప్పటికప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. నవతరం నాయికలకు పోటీగా నిలుస్తుంది. జిమ్-యో గా వంటి ఫిట్ నెస్ చర్యలతో ఆఛామ్ ని కంటున్యూ చేయగల్గుతుంది. 40 ప్లస్ లోనూ ధగధగలాడిపోతుంది. న‌వ నాయిక‌ల‌కు సైతం నా ముందు త‌గ్గాల్సిందే అంటుంది.


తాజాగా క‌రీనా మిర్ర‌ర్ బ్యూటీ ఇన్ స్టాని షేక్ చేస్తుంది. బీచ్ ముందు రిసార్ట్ బ్యూటీని హైలైట్ చేస్తూ ఓ రేంజ్ లో అందాల దాడి చేసింది. బికినీని క‌వ‌ర్ చేస్తూ ఒంటిపై ష‌ర్ట్ ధ‌రించి టాప్ ని క‌వర్ చేసినా? అమ్మ‌డి థై షో మాత్రం మ‌తిపోయేలా చేసింది. మిర్ర‌ర్ ముందు సెల్పీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే మిర‌ర్ర్ లోసైతం థైని లైట్ గా బ్ల‌ర్ చేసింది. క్లారిటీ లోపించిన థై షో చేసింది.

అయినా క‌రీనా ఎంత బ్ల‌ర్ చేసినా ఆ బ్యూటీ ముందు ఎంత‌? ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. కరీనా ఘాటు ఫోజుకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. `ఇట్స్ మండే` అంటూ కొన్ని గంట‌లు క్రిత‌మే ఫోటోని ఇన్ స్టా మార్కెట్ లోకి వ‌దిలింది. జోరుగా వైర‌ల్ అవుతుంది. కాక పుట్టించే క‌రీనా అందానికి సెగ‌లు పొగ‌లుగా మారిపోతున్నాయి. ద‌టీజ్ క‌రీనా అంటూ మ‌రోసారి ప్రూవ్ చేసింది.

ఇక క‌రీనా కెరీర్ సంగ‌తి చూస్తే! బాలీవుడ్ కి ఎంత మంది భామ‌లు దిగొచ్చినా అమ్మ‌డికి పోటీ అనేదే లేదు. ఇటీవ‌లే `ది క్రూ`తో మ‌రో భారీ విజ‌యం ఖాతాలో వేసుకుంది. సినిమా మంచి లాభాలు తేవ‌డంతో అదే కాంబినేష‌న్ మ‌రో సినిమాకి స‌న్నాహాలు చేస్తోంది. అలాగే `సింగం ఎగైన్` లోనూ క‌రీనా కీల‌క పాత్ర పోషిస్తుంది. కాఫ్ స్టోరీలో కరీనా మార్క్ ప‌డుతుంద‌ని అంచ‌నాలున్నాయి.