Begin typing your search above and press return to search.

అతిధి మూవీ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

క్యూట్ గా ముద్దుగా ఉన్న ఆ పాప ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా మారిందో అంటూ నెటిజెన్లు తెగ పొగిడేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 10:30 PM GMT
అతిధి మూవీ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల వయసు చెప్పడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సందర్భాలలో గతంలో వాళ్లతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారి ప్రజెంట్ ఫోటోలను చూసి ఆ సినిమా వచ్చి అన్ని సంవత్సరాలు అయిందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు విషయంలో అయితే వయసు చెప్పడం రోజురోజుకీ కష్టమైపోతుంది. మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ పాప.. ఇప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. క్యూట్ గా ముద్దుగా ఉన్న ఆ పాప ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా మారిందో అంటూ నెటిజెన్లు తెగ పొగిడేస్తున్నారు.


ఇక ఆ పాపని పొగడడంతో పాటు మహేష్ బాబు సినిమా వచ్చి అన్ని సంవత్సరాలు అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు నటించిన అతిధి చిత్రం మీకు గుర్తుందా? అదేనండి స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం. 2007లో విడుదలైన ఈ మూవీను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం డీల పడిపోయింది.

ఈ చిత్రంలో మహేష్ ఓ సరికొత్త లుక్ ని ట్రై చేశారు.. అయితే ఆలుక్ అనుకున్నంతగా ప్రేక్షకులలో క్లిక్ కాలేకపోయింది.. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ ఇందులో కొన్ని పాత్రలు మాత్రం ఆడియన్స్ కి అలా గుర్తుండిపోయాయి. అలాంటి పాత్రల్లో ఒకటి హీరోయిన్ చల్లిగా ఇచ్చిన పాప పాత్ర. అప్పట్లో క్లైమాక్స్ లో ఈ పాప చనిపోవడం ప్రేక్షకులకు ఎంతో బాధ కలిగించింది. సినిమా మొత్తం తన క్యూట్ యాక్షన్ తో ఈ పాప ప్రేక్షకులను బాగా అలరించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పటికి కూడా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఆ పాప పేరు కర్మన్ సంధు.

తాజాగా ఈ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతిధి మూవీ తర్వాత ఆ పాప మరే చిత్రంలో నటించలేదు. కారణాలు తెలివి కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కర్మన్ ఇప్పుడు బిజినెస్ అనలిస్టుగా కెనడాలో జాబ్ చేస్తోంది. మల్టీ టాలెంటెడ్ అయినా ఈ బ్యూటీ అటు జాబ్ తో పాటు ఇటు కెరీర్ కౌన్సిలర్ గా, సైకాలజిస్ట్ గా, బిహేవియర్ తెరపిస్ట్ గా.. ఎన్నో ఉద్యోగాలు చేసింది. కర్మన్ గురించి వివరాలు తెలుసుకున్న నేటిజెన్లు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు.