Begin typing your search above and press return to search.

దర్శన్‌పై రౌడీషీట్‌ తెరుస్తారా? మంత్రికి ప్ర‌శ్న‌!

దర్శన్ అయినా.. పరమేశ్వరుడైనా చట్టం అందరికీ సమానమే. కాబట్టి ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని అన్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 6:43 AM GMT
దర్శన్‌పై రౌడీషీట్‌ తెరుస్తారా? మంత్రికి ప్ర‌శ్న‌!
X

కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అతడి సహచరులను హత్య కేసులో అరెస్టు చేసిన తర్వాత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి అధికారం ఇచ్చినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ప్ర‌క‌టించారు. మీడియాను ఉద్దేశించి పరమేశ్వర మాట్లాడుతూ.. హత్యలో దర్శన్ ప్రమేయం ఉందనే సమాచారం మేరకు దర్శన్‌ను అరెస్టు చేశార‌ని తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందని, వచ్చిన ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. దర్శన్ అయినా.. పరమేశ్వరుడైనా చట్టం అందరికీ సమానమే. కాబట్టి ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని అన్నారు.

రేణుకాస్వామి .. ద‌ర్శ‌న్ మహిళా స్నేహితురాలి గురించి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసి ఉంటే, అతడు ఫిర్యాదు చేసి ఉండవచ్చు.. పోలీసులు వెంటనే చర్య తీసుకునేవారు.. అని అన్నారు. మాకు తెలిసిన‌ సమాచారం ప్ర‌కారం..అత‌డిని బెంగుళూరుకు తీసుకువచ్చి కొట్టి చంపారు.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు``అని హోం మంత్రి తెలిపారు.

దర్శన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రభావవంతమైన రాజకీయ నాయకుల సహాయం తీసుకున్నారా? అని ప్ర‌శ్నించ‌గా.. మంత్రి మాట్లాడుతూ .. తనకు తెలిసినంతవరకు తనను (నటుడిని) ప్రభావితం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదని ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ``ప్రభుత్వం నుండి ఎవరూ జోక్యం చేసుకోరు. పోలీసులకు స్వేచ్ఛ‌నిచ్చామని, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి స‌హ‌క‌రిస్తామని మంత్రి వ‌ర్యులు చెప్పారు. ప్రతి కేసును దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాల్సిన అవసరం లేదని అన్నారు. కనీసం 13 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారి గురించి తెలుసు. కేసును వేరే ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం లేదు! అని మంత్రి అన్నారు.

అతడు సాధారణ నేరస్థుడా కాదా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తారు... వారి నివేదికలో దర్యాప్తు తర్వాత వారు (పోలీసులు) ఏమి సిఫార్సు చేస్తారో చూడాలి.. పోలీసులకు స్వేచ్ఛ ఉంది. సెక్షన్లను అమలు చేయడానికి వారికి స్వేచ్ఛ ఉంది. వారికి అవకాశం ఉంది.. దర్శన్‌పై రౌడీషీట్‌ తెరుస్తారా? అని అడిగినప్పుడు అది చేయాలా వ‌ద్దా? అనేది పోలీసులు మమ్మల్ని అడగనవసరం లేదని మంత్రి గారు వ్యాఖ్యానించారు.

2011లో దర్శన్ తన భార్యపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. తరువాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. దంపతులు సమస్యను పరిష్కరించుకున్నారు. ఆమె అతనిపై కేసును ఉపసంహరించుకుంది.

రేణుకాస్వామి భౌతికకాయాన్ని చిత్రదుర్గలోని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చి, వీరశైవ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) ప్రెసిడెంట్ ఎన్‌ఎం సురేష్ మాట్లాడుతూ దర్శన్‌పై చర్య తీసుకునే విషయమై ఆర్టిస్టుల యూనియన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.