Begin typing your search above and press return to search.

సాగర సంగమంతో పోలిక.. చాలా పెద్ద స్టేట్మెంట్ కార్తి..!

ఈ సినిమాలో అరవింద్ స్వామి నేను ఇద్దరిలో ఎవరు లేకపోయినా సరే ఈ సినిమా లేదని అన్నారు కార్తి.

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:53 PM GMT
సాగర సంగమంతో పోలిక.. చాలా పెద్ద స్టేట్మెంట్ కార్తి..!
X

కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్ లో 96 తో దర్శకుడిగా తన మార్క్ చూపించిన ప్రేం కుమార్ లేటెస్ట్ గా సత్యం సుందరం సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య నిర్మించడం విశేషం. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు కార్తి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమాలో అరవింద్ స్వామి నేను ఇద్దరిలో ఎవరు లేకపోయినా సరే ఈ సినిమా లేదని అన్నారు కార్తి. హ్యూమర్ తో పాటు హార్ట్ వార్మింగ్ మూవీగా ఈ సినిమా వస్తుంది. అందరు చూసే సినిమా ఇది అన్నారు. ఫ్యామిలీతో కలిసి అందరు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు కార్తి.

సత్యం సుందరం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? కథ ఎలా ఉంటుంది..?

96 లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేసిన సినిమా ఇది. 96 సినిమాకు చాలా మంది ఫాలోయింగ్ ఉంది. ఐతే ఆరేళ్ల తర్వాత ఆ దర్శకుడి నుంచి వస్తున్న సినిమాగా సత్యం సుందరం మెప్పిస్తుందని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రేం దగ్గర ఒక కథ ఉందని ఫ్రెండ్ చెప్పడంతో నేనే ఆయన్ను కలిసి స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ మొత్తం చదివాక తెలియకుండానే చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అసలు ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. కే విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఇష్టం. ఐతే ఇప్పుడు అలాంటి కథలు రావట్లేదు. ఇది ఒక రేర్ స్క్రిప్ట్. కచ్చితంగా చేయాలనిపించింది. మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఈ కథ చెబుతుంది. అన్నయ్యకు కథ నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తాయని అన్నారు. అలా ప్రాజెక్ట్ చేశామన్నారు.

ఇద్దరి మధ్య నడించే కథ ఇది. ప్రతి ఒక్కరు చూసేలా సినిమా ఉంటుంది. అరవింద్ స్వామి గారు ఇందులో పర్ఫెక్ట్ చాయిస్. ఆయన కూడా స్క్రిప్ట్ విని చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది కూడా 96 లానే ఒక రాత్రి జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చ్తీంగా కొత్త ఎక్స్ పీరియన్స్ అవుతారు. సాగర సంగమం చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరం కూడా మంచి అనుభూతి అందిస్తుందని అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్స్. ఇది కూడా అలాంటి సినిమానే అని అన్నారు కార్తి.

ఆ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న కోర్ ఎలిమినెట్ ఏంటి..?

ఈ కథలోని అన్ కండీషన్ లవ్. మనకి ఫ్యామిలీ నుంచి వచ్చే అన్ కండీషన్ లవ్ దొరుకుతుంది. అలాంటి లవ్ ని చూపించే సినిమా ఇది. మన కల్చర్, రూట్స్ కి సంబంధించిన స్టోరీ ఇదని అన్నారు.

అంతేకాదు ఇందులో హ్యూమర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ తో వస్తుంది. చాలా చోట్ల హ్యాపీ టియర్స్ వస్తాయి. ఊపిరి సినిమా చూసినప్పుడు ఎలాంటి బ్యూటీఫుల్ ఎమోషన్ అనిపించిందో ఇది కూడా అలానే ఉంటుందని అన్నారు.

ఈ కథ లాంటిది అరవింద్ స్వామి గారి నిజ జీవితంలో జరిగిందని తెలిసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ లో ఆయన తప్ప వేరొకరిని ఊహించలేం. మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అన్నారు.

తెలుగులో ఒక రోజు ఆలస్యానికి కారణం..?

తెలుగులో దేవర వస్తంది. అది చాలా పెద్ద సినిమా. అందుకే ఆ తర్వాత రోజు రావడం బెటర్ అనిపించింది. రెండు చాలా డిఫరెంట్ సినిమాలు. అది ఒక వార్ లా ఉంటే. మాది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా అని అన్నారు కార్తి.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

పల్లెటూరిలో శారీ షాప్ నడిచే ఇన్నోసెంట్ క్యారెక్టర్. తనకి లైఫ్ మీద ఎలాంటి అంచనాలు ఉండవు. చాలా సరదాగా ఉండే క్యారెక్టర్. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అన్నారు కార్తి.

గోవింద్ వసంత్ మ్యూజిక్ గురించి ?

అతనొక మంచి కంపోజర్. ఈ కథ విని నా ప్రతిభని ఛాలెంజ్ చేస్తుందని గోవింద్ వసంత్ అన్నారు. ప్రతి సాంగ్ మీనింగ్ ఫుల్ గా ఉంటుంది. బిజిఎం హంటింగ్ గా ఉంటుంది. అంతేకాదు ఇందులో డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. కెమెరా మూమెంట్స్ కూడా ఆర్గానిక్ గా ఉంటాయి. సినిమాలో ఒక లైఫ్ కనిపిస్తుందని అన్నారు.

ప్రేమ్ కుమార్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

ప్రేం కుమార్ ప్లానింగ్ ఉన్న డైరెక్టర్. ప్రతిదీ రెడీగా ఉంచుతారు. గొప్ప అండర్ స్టాండింగ్ ఉంటుంది. అద్భుతమైన మాటలు రాశారు. ఈ కథ చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని అన్నారు.

సూర్య గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు..?

ఈ సినిమాకు అన్నయ్య ప్రొడ్యూసర్. ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకరోజు రాత్రి షూటింగ్ కి రోలెక్స్ కోసం వచ్చారు. అన్నయ్య నా మొదటి సినిమా చూసి హగ్ చేసుకున్నారు. మళ్లీ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా ఉందని హగ్ చేసుకున్నారు. అద్భుతంగా చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి ?

సునీల్ గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారని తెలిసి సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన జడ్జిమెంట్ పై నమ్మకం ఉంది.

ఢిల్లీ, రోలెక్స్ పేస్ అఫ్ ఎప్పుడు ?

అది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది.

స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?

చేయాలని ఉంది. ఊపిరి తర్వాత తెలుగులో చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తానని అన్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

సర్దార్ 2 షూటింగ్ జరుగుతోంది. వా వాతియారే అనే సినిమా కూడా చేస్తున్నాను. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చని అన్నారు కార్తి.