Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి మరో హీరో

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి మంచి డిమాండ్ ఉంది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 11:04 AM GMT
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి మరో హీరో
X

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి మంచి డిమాండ్ ఉంది. ‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి డిమాండ్ పెరిగింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 10 సినిమాల వరకు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులోనే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఉంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

అలాగే ‘జై హనుమాన్’ మూవీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కనుంది. దాంతో పాటుగా డివివి దానయ్య తనయుడు మూవీ కూడా ఉండబోతోంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గా చాలా ప్రాజెక్ట్స్ ని ప్రశాంత్ వర్మ లైన్ అప్ లో పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ కార్తీ ‘సత్యం సుందరం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కొన్ని నెలల క్రితం కార్తీకి కథ చెప్పడానికి చెన్నై వెళ్లానని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఒక ప్రాజెక్ట్ కోసం అతన్ని కలవడం జరిగిందని అన్నారు. కార్తీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నానని ప్రశాంత్ వర్మ ఈ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు. కార్తీ కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మూవీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు చెప్పాడు. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ మూవీ చేయడం కన్ఫర్మ్ అనే మాట వినిపిస్తోంది.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మరికొన్ని ఇంటెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘96’ మూవీ అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు. ఆ మూవీ చూసిన తర్వాత బిజీ షెడ్యూల్ నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ‘96’ సినిమాకి మ్యూజిక్ అందించిన గోవింద్ వసంత్ సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయని అన్నారు.

మరల వారిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి తనకి చూడాలనే క్యూరియాసిటీ ఉందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 28న ‘సత్యం సుందరం’ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. దేవరకి పోటీగా రిలీజ్ అవుతున్న కూడా ఫీల్ గుడ్ డ్రామాతో ‘సత్యం సుందరం’ ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.