Begin typing your search above and press return to search.

ఆయ‌న‌తో అమ్మ‌డు హ్యాట్రిక్ కొట్టేలా!

ఈ నేప‌థ్యంలోనే ర‌జీషా పేరు ప‌రిశీల‌నకు వ‌చ్చింది. కార్తీతో అమ్మ‌డికి గ‌తంలో న‌టించిన అనుభ‌వం ఉంది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 12:30 PM GMT
ఆయ‌న‌తో అమ్మ‌డు హ్యాట్రిక్ కొట్టేలా!
X

కోలీవుడ్ స్టార్ కార్తీ పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. ప్ర‌స్తుతం ఏక కాలంలో రెండు సినిమా షూటింగ్ ల్లో పాల్గోంటున్నాడు. `వా వ‌త్తాయార్` తో పాటు `స‌ర్దార్ 2` షూటింగ్ లో నూ పాల్గొంటున్నాడు. అటు లోకేష్ క‌న‌గ‌రాజ్ `కూలీ` నుంచి రిలీజ్ అవ్వ‌గానే `ఖైదీ-2` చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే ఏడాది `ఖైదీ 2` మొద‌ల‌వుతుందని లోకేష్ ఇప్ప‌ట‌కే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో `కూలీ` త‌ర్వాత సెట్స్ కి వెళ్లేది ఆ చిత్ర‌మేనని తేలిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా లోకేష్ టీమ్ మొద‌లు పెట్టింది. టెక్నిక‌ల్ గా దాదాపు పాత టీమ్ నే య‌ధావిధిగా కంటిన్యూ చేస్తోంది. న‌టీనటుల విష‌యంలో మాత్రం పాత పాత్ర‌ల‌తో పాటు కొన్ని కొత్త పాత్ర‌లు సినిమాలో యాడ్ అవుతున్నాయి. అయితే హీరోయిన్ గా ర‌జీషా విజ‌యన్ ని తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా `ఖైదీ-2` లో హీరోయిన్ పాత్ర ఉంటుంది.

ఈ నేప‌థ్యంలోనే ర‌జీషా పేరు ప‌రిశీల‌నకు వ‌చ్చింది. కార్తీతో అమ్మ‌డికి గ‌తంలో న‌టించిన అనుభ‌వం ఉంది. కార్తీ హీరోగా న‌టించిన `స‌ర్దార్` లో న‌టించింది. తాజాగా సెట్స్ లో ఉన్న `స‌ర్దార్ 2`లో కూడా న‌టిస్తోంది. దీంతో లోకేష్ కూడా `ఖైదీ 2` కోసం అదే భామ‌ను రిపీట్ చేస్తున్నాడు. ఈ సినిమా గ‌నుక హిట్ అయితే ర‌జీషా ఖాతాలో కార్తీతో హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే. గ‌త రెండు విజయాల నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ర‌జీషాకి ఉంది.

ల‌క్కీగా లోకేష్ కూడా ఆమెని తెర‌పైకి తేవ‌డం కూడా అమ్మ‌డికి క‌లిసొస్తుంది. ప్ర‌స్తుతం ర‌జీషా విజ‌య‌న్ `బైస‌న్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ద్రువ్ విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇందులో మెయిన్ లీడ్ మాత్రం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పోషిస్తుంది. సెకెండ్ లీడ్ లో ర‌జీషా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.