Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో క్ర‌ష్ గుట్టు ర‌ట్టు చేసిన బాల‌య్య‌!

తాజాగా `కంగువ` ప్ర‌మోష‌న్ లో భాగంగా అన్ స్టాప‌బుల్ షోకి సూర్య కూడా హాజ‌ర‌య్యాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2024 6:09 AM GMT
ఆ స్టార్ హీరో క్ర‌ష్ గుట్టు ర‌ట్టు చేసిన బాల‌య్య‌!
X

హీరోయిన్ల క్ర‌ష్ గురించి అంతా ఓపెన్ గానే వ్య‌వ‌హారం ఉంటుంది. ఏ హీరో అంటే క్ర‌ష్ అన‌గానే పెద్ద‌గా సిగ్గు, బిడియం లేకుండా ఓపెన్ గానే త‌మ హీరో పేరును చెబుతుంటారు. కానీ స్టార్ హీరోల విష‌యానికి వ‌చ్చేసరికి హీరోయిన్ల విష‌యంలో ఓపెన్ అవ్వ‌డం క‌ష్టం. అలాంటి క్ర‌ష్ ల గురించి ఎవ‌రూ క్వ‌శ్చ‌న్ కూడా చేయ‌రు. సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు హీరోల‌కు బాలీవుడ్ లో ఎదుర‌వుతాయి. ఇక్క‌డి స్టార్లు క‌ర‌ణ్ జోహార్ టాక్ షోల‌కు హాజ‌రైన‌ప్పుడు మాత్రం ఓపెన్ అవ్వ‌క త‌ప్ప‌దు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ గ్రేట్ హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ నే మించి పోతున్నారు. మ‌న స్టార్ హీరోల్ని ఎలా ఇరికిస్తున్నారో? క‌నిపిస్తూనే ఉంది. పెళ్లి చేసుకోని ప్ర‌భాస్ విష‌యంలో బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగారో తెలిసిందే. ఇంకా విశ్వ‌క్ సేన్, సిద్దుజొన్న‌ల‌గ‌డ్డ ఇలా బ్యాచిల‌ర్ హీరోలంద‌ర్నీ బాల‌య్య ఏమాత్రం వ‌దిలి పెట్ట‌కుండా ఆడుకుంటారు. అంత‌కు ముందు ఐకాన్ స్టార్ బ‌న్నీని సైతం వ‌ద‌ల్లేదు. త‌న‌దైన మార్క్ హోస్టింగ్ తో హీరోల్నే కాదు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించారు.

బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌లు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి. అందుకే హీరోలు కూడా అంతే స‌ర‌ద‌గా బదులుస్తుంటారు. తాజాగా `కంగువ` ప్ర‌మోష‌న్ లో భాగంగా అన్ స్టాప‌బుల్ షోకి సూర్య కూడా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా అత‌డిని త‌న‌దైన శైలిలో బాల‌య్య స‌ర‌ద‌గా ఆట‌ప‌ట్టించారు. బాల‌య్య హోస్టింగ్ చూసి సూర్య ఎంతో సంతోష ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా సూర్య‌తో సోద‌రుడు కార్తీకి ఫోన్ క‌నెక్ట్ చేయించారు బాలయ్య‌. ఇంట్లో సూర్య ఎలా ఉంటాడో కార్తీని అడిగి తెలుసుకున్నారు.

మ‌హా బ‌ద్ద‌క‌స్తుడు అంటూ కార్తీ అన్న గురించి చెబుతాడు. ఈ నేప‌థ్యంలో కార్తీని నీ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రూ అంటూ బాల‌య్య అడిగారు. దానికి కార్తీ `చికుబుకు చికుబుకు రైలే సాంగ్ కి స్టెప్పులేసిన అప్ప‌టి అందాల హీరోయిన్ గౌత‌మి` పేరు చెబుతాడు. దీంతో సూర్య `నువ్వు కార్తీ కాదురా..క‌త్తిరా` అంటూ న‌వ్వేస్తాడు. ఇలాంటి హింట్ ఇస్తే బాల‌య్య ఊరుకుంటారా? ఆయ‌న స్టైల్లో చెలేరిపోరు. బాల‌య్య చ‌మ‌త్కారంతో ప్రేక్షకుల్లో న‌వ్వులు పువ్వులు పూయించారు.