Begin typing your search above and press return to search.

కార్తి సినిమాను తక్కువ అంచనా వేయొద్దు

కొన్ని సందర్భాల్లో ఓ భారీ చిత్రం రిలీజవుతుంటే.. దాంతో పాటుగా వచ్చే చిన్న, మీడియం రేంజ్ సినిమాలను జనం విడుదల ముంగిట దాన్ని పెద్దగా పట్టించుకోరు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 5:24 PM GMT
కార్తి సినిమాను తక్కువ అంచనా వేయొద్దు
X

కొన్ని సందర్భాల్లో ఓ భారీ చిత్రం రిలీజవుతుంటే.. దాంతో పాటుగా వచ్చే చిన్న, మీడియం రేంజ్ సినిమాలను జనం విడుదల ముంగిట దాన్ని పెద్దగా పట్టించుకోరు. అది నామమాత్రంగా రిలీజవుతున్నట్లు అనిపిస్తుంది. ఆ పెద్ద సినిమా ధాటికి ఈ చిన్న/మీడియం రేంజ్ సినిమా ఏం తట్టుకుంటుందో అన్న సందేహాలు తలెత్తుతాయి. కానీ తీరా చూస్తే పెద్ద సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. బజ్ లేని ఆ చిన్న/మిడ్ రేంజ్ సినిమానే అదరగొడుతూ ఉంటుంది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ తుస్సుమనిపిస్తే.. ‘హనుమాన్’ ఎలా ఇరగాడేసిందో తెలిసిందే. ఇక ఇటీవల ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన క్రేజీ మూవీస్ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ బోల్తా కొట్టగా, ‘ఆయ్’ అనే చిన్న సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ‘దేవర’కు పోటీగా రిలీజవుతున్న తమిళ డబ్బింగ్ మూవీ ‘సత్యం సుందరం’ను తక్కువ అంచనా వేయకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘దేవర’ మీదే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయా చిత్రానికి. ‘సత్యం సుందరం’ణు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఐతే ‘దేవర’కు ఎదురెళ్లడం ఎందుకని ఒక రోజు లేటుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ సమయానికి ‘దేవర’ టాక్ బయటికి వచ్చేస్తుంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్ చూస్తే అది గుండెల్ని పిండేసే హృద్యమైన సినిమాలా కనిపిస్తోంది. ట్రైలర్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. చెన్నైలో ఈ సినిమాకు ప్రివ్యూ షో వేయగా.. అద్భుతమైన టాక్ వచ్చింది. కార్తి, అరవింద్ స్వామిల కెరీర్లో ఇది మైల్ స్టోన్ మూవీ అంటున్నారు. ఇప్పటికి మన జనాల దృష్టి ఈ సినిమా మీద పడలేదు కానీ.. శనివారం కచ్చితంగా దీని మీద ఒక లుక్కేస్తారు. ‘దేవర’ టాక్ అటు ఇటుగా ఉంటే ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయినట్లే. ‘దేవర’ తాలూకు ఓవర్ ఫ్లోస్ కూడా ఈ సినిమాకు కలిసొస్తాయి. టాక్ పరంగా అంతరం ఉంటే.. ‘దేవర’ను ‘సత్యం సుందరం’ దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదు.