Begin typing your search above and press return to search.

కార్తీ 'సత్యం సుందరం'.. 100% హృదయాన్ని హత్తుకునేలా!

సెప్టెంబర్ లోనే రిలీజ్ కానున్న ఆ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 1:53 PM GMT
కార్తీ సత్యం సుందరం.. 100% హృదయాన్ని హత్తుకునేలా!
X

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆవారా, ఖైదీ, నా పేరు శివ లాంటి సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సర్దార్ 2, వా వాతియ‌ర్ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా మరో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దర్శకుడు త‌మిళ్ డైరెక్షన్ లో వర్క్ చేయనున్నారు. ఇప్పుడు సత్యం సుందరం మూవీతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

సూపర్ హిట్ మూవీ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ సినిమాలో కార్తీతోపాటు మరో కోలీవుడ్ స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. మ్యూజికల్ కల్ట్ క్లాసిక్ 96తో వేరే లెవెల్ లో అలరించిన ప్రేమ్ కుమార్ దర్శకుడు కావడంతో సత్యం సుందరం మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ లోనే రిలీజ్ కానున్న ఆ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్.. సినిమా కచ్చితంగా చూడాలనిపించే విధంగా అందరినీ ఆకట్టుకుంది. సినీ ప్రియుల హృదయాలను హత్తుకునేలా మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది. అరవింద్ స్వామి- కార్తీ కెమిస్ట్రీ మూవీకే హైలెట్ గా నిలిచేలా కనిపిస్తుంది. అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ లో కార్తీ, రిజర్వ్‌ డ్- అర్బన్ పర్సనాలిటీ గా అరవింద్ స్వామి అలరించనున్నట్లు అర్థమవుతుంది. డిఫరెంట్ రోల్స్ లో మ్యాజిక్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

హీరో కార్తీ తన కామిక్ టైమింగ్ తో సత్యం సుందరం మూవీలో మరోసారి మెప్పించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గోవింద్ వసంత మ్యూజిక్ చిత్రానికి బిగ్ ప్లస్ పాయింట్ గా మారేలా అనిపిస్తుంది. టీజర్, ట్రైలర్ ద్వారా ఇది పక్కా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో ప్రేమ్ కుమార్ సీ రూపొందించిన సత్యం సుందరం మూవీ.. వంద శాతం హ్యూమరస్ అండ్ హార్ట్ వార్మింగ్, టచింగ్ సినిమాగా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిస్ చేస్తోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. కార్తీ, అరవింద్ స్వామితో పాటు శ్రీ దివ్య, స్వాతి కొండే, శ్రీరంజని, జయ ప్రకాష్, రాజ్ కిరణ్, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై సూర్య, జ్యోతిక గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన కోలీవుడ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్..ఆ తర్వాత రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మరి సత్యం సుందరం మన దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.