Begin typing your search above and press return to search.

కార్తీ 'సత్యం సుందరం'.. థియేటర్స్ లోకి మళ్ళీ కొత్తగా..

కార్తీ తాజా తమిళ చిత్రం తెలుగులో 'సత్యం సుందరం' అనే పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:30 AM GMT
కార్తీ సత్యం సుందరం.. థియేటర్స్ లోకి మళ్ళీ కొత్తగా..
X

కార్తీ తాజా తమిళ చిత్రం తెలుగులో 'సత్యం సుందరం' అనే పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మానవ సంబంధాలను చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, అయితే ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రధాన ఫీడ్‌బ్యాక్ లో సినిమా నిడివి గురించి కొంత అసంతృప్తి వ్యక్తమైంది.

ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాలు. ఇది కొన్ని చోట్ల మరింత సుదీర్ఘంగా అనిపించిందని, ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయినప్పటికీ, మరింత ఎంగేజింగ్‌గా మారాలంటే ట్రిమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉందని అనిపించిందని సమాచారం. ఇక ప్రేక్షకుల నుండి వచ్చిన ఈ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని, చిత్ర బృందం సినిమా నిడివి తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది.

సినిమా విడుదలైన కొన్ని రోజులకే, జాగ్రత్తగా అన్ని వైపుల నుండి వచ్చిన సలహాలను పరిశీలించి, మూవీని దాదాపు 18 నిమిషాలు కత్తిరించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ట్రిమ్ చేసిన కొత్త వెర్షన్ లో సినిమా మరింత బలమైన కథనంతో ముందుకు సాగుతుందని, సుదీర్ఘంగా ఉండే కొన్ని సన్నివేశాలను తీసేయడం ద్వారా ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మారుతుందని భావిస్తున్నారు.

తాజాగా ట్రిమ్మింగ్ చేసిన ‘మేయళగన్’ వెర్షన్ థియేటర్లలోకి విడుదలైంది. ఇప్పుడు ఇదే మార్పును తెలుగు వెర్షన్ అయిన ‘సత్యం సుందరం’కీ వర్తింపజేయనున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా అదే విధంగా కథ మరింత కట్టిపడేయడంలో సాయపడుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి, శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాశ్, సరన్, దేవదర్శిని కీలక పాత్రల్లో నటించారు. వీరి నటనతో పాటు, సన్నివేశాల భావోద్వేగ భరితమైన ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రిమ్మింగ్ తర్వాత సినిమా ప్రేక్షకులను మరింత ఆకర్షించవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగులో సత్యం సుందరం సినిమాకు దేవర పోటీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో కంటే ఒక రోజు ఆలస్యంగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ దేవర ఇంపాక్ట్ మరుసటి రోజు కూడా చూపించింది. ఇక మరికొన్ని రోజుల్లో సెలవులు ఉన్నాయి కాబట్టి సత్యం సుందరం ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.