Begin typing your search above and press return to search.

పూర్తిగా తెలుగువాడైన స్టార్ హీరో..!

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 12:30 PM GMT
పూర్తిగా తెలుగువాడైన స్టార్ హీరో..!
X

కోలీవుడ్ హీరో కార్తి తెలుగు ఆడియన్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. తమిళ్ లో రజిని, కమల్, విక్రం, సూర్య, విజయ్, ధనుష్ ఇలా చాలా మంది హీరోలు తెలుగు ఆడియన్స్ మనసులు గెలిచారు. వారిలో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కార్తి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరవడానికి మెయిన్ రీజన్ అతను స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు కాబట్టే. అంతేకాదు తన ప్రతి సినిమాకు తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. మన బాష మాట్లాడే వాళ్లను మన వాళ్లే అనుకుంటాం కదా అలానే కార్తి కూడా తెలుగు హీరో అయిపోయాడు.


అంతేకాదు తను ఎంచుకునే కథలు వేటికవే ప్రత్యేకంగా ఉండటం వల్ల కార్తి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. రీసెంట్ గా కార్తి సత్యం సుందరం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 96 ఫేం ప్రేం కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కార్తి తో పాటు అరవింద్ స్వామి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్యే నడుస్తుంది. తమిళంలో మేయలగన్ సినిమాను తెలుగులో సత్యం సుందరం అని రిలీజ్ చేశారు.

దేవర వచ్చిన నెక్స్ట్ డే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దేవర కు పోటీ అని చెప్పడం కష్టం కానీ ఈ సినిమా మనసుకి హత్తుకునే ఎమోషన్స్ తో మెప్పించింది. ఐతే ఈ సినిమాలో మరో ఎట్రాక్షన్ గా కార్తి తెలుగు డబ్బింగ్ నిలిచింది. తెలుగులో స్పష్టంగా మాట్లాడటమే కాకుండా వేరియేషన్స్ చూపించాడు కార్తి. సుందరం పాత్రకు పర్ఫెక్ట్ డిక్షన్ పాటిస్తూ అదరగొట్టాడు. తెలుగులో తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో కార్తి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా వర్క్ అవుట్ అవుతున్నాయనే చెప్పొచ్చు.

సత్యం సుందరం కోసం సినిమాలో తెలుగు బోర్డులు కనిపించేలా చేసి మన ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేశారు. కార్తీ మాత్రం తన పాత్రతో అదరగొట్టేశాడు. సత్యం పాత్రలో అరవింద్ స్వామి కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించారు. మొత్తానికి కార్తి తెలుగు బాష చూస్తుంటే పూర్తిగా తెలుగు వాడైనట్టే అని చెప్పొచ్చు.