స్టార్ తమ్ముడు ఇంత గ్యాప్ ఐతే ఎలా..?
ఈ రెండు సినిమాలు కార్తి ఫ్యాన్స్ ని అలరించనున్నాయి. ఐతే కార్తి సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు అన్న కంప్లైంట్ వస్తుంది.
By: Tupaki Desk | 3 April 2025 3:15 AMకోలీవుడ్ స్టార్ కార్తి సినిమాల విషయంలో కాస్త స్లో అవుతున్నాడు. స్టార్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ అంటే ఆ సినిమాలకు కనీసం రెండేళ్లు పడుతుంది. కార్తి ప్రస్తుతం అలాంటి సినిమాలు చేయట్లేదు. మీడియం రేంజ్ బడ్జెట్ తోనే సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మేయళగన్ సినిమా ఒక్కటే చేశాడు. సూర్య కంగువ సినిమాలో కూడా సర్ ప్రైజింగ్ రోల్ చేశాడు కానీ అది క్యామియో రోల్ కిందకే వస్తుంది.
2023 లో కూడా కార్తి పి.ఎస్ 2, జపాన్ సినిమాలతో వచ్చాడు. ఐతే ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన మేయళగన్ అదే సత్యం సుందరం సినిమా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం సర్ధార్ 2 సినిమా చేస్తున్నాడు కార్తి. ఆ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు వా వాతియార్ కూడా రానుంది.
ఈ రెండు సినిమాలు కార్తి ఫ్యాన్స్ ని అలరించనున్నాయి. ఐతే కార్తి సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు అన్న కంప్లైంట్ వస్తుంది. ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా తీసి అలా ఆడియన్స్ ముందుకు రావడం కన్నా కరెంట్ హిట్ టార్గెట్ తో వస్తే బాగుంటుందని కార్తి భావిస్తున్నాడు. అందుకే కార్తి సినిమాలు కాస్త లేట్ అవుతూ వస్తున్నాయి.
త్వరలో రాబోతున్న రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో తెలుగు స్ట్రైట్ సినిమా కోసం కార్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అందులో ఏది వర్క్ అవుట్ కాలేదు. కార్తి కి తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్క కార్తి తెలుగు సినిమా చేస్తే చూడాలని కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
కార్తి అలాంటి ప్రయత్నాలు చేయాలని చూస్తున్నా తనని మెప్పించే కథలు రావట్లేదని టాక్. మరి కార్తి నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుగులో ఎప్పుడు సినిమాలు చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. కార్తి లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన ఖైదీ సూపర్ హిట్ కాగా త్వరలో ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఐతే ఈ సినిమాపై తెలుగులో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే లోకేష్ కేవలం తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని కూడా స్టోరీ రాసుకున్నట్టు తెలుస్తుంది.