Begin typing your search above and press return to search.

బిర్యానీ బకెట్‌ కి ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..!

ఖైదీ విడుదల అయినప్పటి నుంచి సీక్వెల్ గురించి ఆసక్తి వ్యక్తం అయ్యింది.

By:  Tupaki Desk   |   10 July 2024 5:02 AM GMT
బిర్యానీ బకెట్‌ కి ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..!
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ సందడి కొనసాగుతోంది. సౌత్‌ లో కొందరు దర్శకులు బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. ఖైదీ తో పాటు విక్రమ్‌ సినిమా తో లోకేష్ కనగరాజ్ తనదైన సినిమాటిక్ యూనివర్శ్‌ ను క్రియేట్‌ చేశాడు.

ఖైదీ విడుదల అయినప్పటి నుంచి సీక్వెల్ గురించి ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఆ మధ్య అందరూ కోరుకున్నట్లుగానే ఖైదీకి సీక్వెల్‌ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తాజా చిత్రం కూలీ ని రజినీకాంత్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

ఇక హీరో కార్తీ తన జపాన్ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాడు. గతంలో హిట్‌ అయిన సర్దార్‌ కి సీక్వెల్‌ గా కార్తీ సర్దార్‌ 2 సినిమాను చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చకచక జరుగుతోంది.

తాజాగా కార్తీ ఒక చిట్‌ చాట్‌ లో ఖైదీ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఖైదీ 2 సినిమాను 2025 లో ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నాడు. మళ్లీ బిర్యానీ బకెట్‌ ని అందుకునే సమయం రాబోతుంది. అయితే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది అన్నట్లుగా పేర్కొన్నాడు.

కార్తీ ఖైదీ సినిమాలో చేసిన ఢిల్లీ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. లోకేష్ కనగరాజ్ ఆ పాత్రను చూపించిన తీరు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను మెప్పించింది. అందుకే సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ లియో మరియు విక్రమ్‌ ల సీక్వెల్స్ ను కూడా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.