బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేసే దివాలీ హీరో ఎవరు?
మొన్నే దసరా వెళ్లింది. `భగతవంత్ కేసరి`..`లియో` లాంటి చిత్రాలు సీజన్ ని ఎన్ క్యాష్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 5 Nov 2023 4:30 PM GMTమొన్నే దసరా వెళ్లింది. `భగతవంత్ కేసరి`..`లియో` లాంటి చిత్రాలు సీజన్ ని ఎన్ క్యాష్ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు మంచి విజయంతో బాక్సాఫీస్ మోతెక్కింది. ఇక దీపావళి కూడా ఎన్నో రోజుల్లో లేదు. మరో వారంలో ఆ పండుగ కూడా వచ్చేస్తుంది. ఈసారి దివాలీ తొందగరా వచ్చేసింది. దసరాకి-దివాలీకి పెద్దగా గ్యాప్ కనిపించలేదు. దసరా వెళ్లిన రెండు వారలకే దీపావళి కూడా రావడంతో తెలుగు సినిమాలేవి పెద్దగా రిలీజ్ లేవు.
ఉంటే కొన్ని చిన్నా చితకా సినిమాలుంటాయి తప్ప! ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు. అయితే అనువాదాల రూపంలో ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం పటాస్ లో పేలడానికి రెడీగా ఉన్నారు. వాళ్లే సల్మాన్ ఖాన్.. కార్తీ.. లారెన్స్..ఎస్. జె సూర్యలు. దివాలీ పోటీ ఈ ముగ్గురు మధ్యనే కనిపిస్తుంది. పైగా ఈ చిత్రాల్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయడంతో పోటీ తీవ్రంగానే ఉందనిపిస్తుంది.
మూడు సినిమాల రాకతో భారీ ఎత్తున థియేటర్ల సర్దుబాటు జరుగుతుంది. కార్తీ హీరోగా నటించిన `జపాన్` చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో రిలీజ్ చేస్తుంది. నాగార్జున-కార్తీ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు కలిసి ఊపిరి చేసారు. అలాగే కార్తీ నటించిన సర్దార్ ని కూడా ఇదే బ్యానర్ గతంలో రిలీజ్ చేసి నష్టాలు చూసింది. ఇప్పుడా లెక్కలు బ్యాలెన్స్ చేసేలా జపాన్ హక్కులు కార్తీ అన్నపూర్ణ సంస్థకి ఇచ్చాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో జపాన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్..ఎస్. జె సూర్య నటించిన జిగర్ త్తాండా డబుల్ ఎక్స్ ఎల్ కి కూడా క్రేజ్ బాగానే ఉంది. ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాన్ని సురేష్ బాబు- ఏషియన్ సునీల్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ టైగర్ -3 కూడా రిలీజ్ అవుతుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఆ చిత్రానికి తెలుగు నుంచి దిల్ రాజు అండ ఉంది. దీంతో ఈ సినిమా కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ముగ్గురి మధ్య పోటీ ఉంటుంది. అంతిమంగా బాక్సాఫీస్ వద్ద పటాస్ లా భారీ శబ్దంతో పేలేది ఏ హీరో అన్నది చూడాలి.