Begin typing your search above and press return to search.

కార్తీ రేంజ్ పెరిగింది.. 150 కోట్లా?

ఈ లెెక్కన చూస్తే.. ఇప్పటివరకు కార్తీ నటించిన సినిమాల కన్నా ఇదే అత్యధికంగా బిజినెస్ జరిగిన చిత్రం. కార్తీ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్.

By:  Tupaki Desk   |   4 Aug 2023 11:30 PM GMT
కార్తీ రేంజ్ పెరిగింది.. 150 కోట్లా?
X

వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో కార్తి. రీసెంట్ గా 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న కొత్త సినిమా.. 'జపాన్‌'. కార్తి 25వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ రీలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాణానంతర పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. దీపావళికి ఈ చిత్రం రిలీజ్ రానుంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కిలోల కొద్దీ బంగారాన్ని దొంగలించిన ఓ దొంగ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తి.. బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి పాత్రలోనే నటించారు. ఈ కథకు కాస్త కామెడీ జోడించి, కొత్త గెటప్ లో కార్తి కనిపించనున్నారు.

అయితే ఇప్పుడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అలాగే ట్రేడ్‌ వర్గాల్లోనూ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ బిజినెస్‌ రు.150 కోట్లు జరిగిందని సినీ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేశాయి. ఈ లెెక్కన చూస్తే.. ఇప్పటివరకు కార్తీ నటించిన సినిమాల కన్నా ఇదే అత్యధికంగా బిజినెస్ జరిగిన చిత్రం. కార్తీ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్.

ఇక ఈ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. రవివర్మ ఛాయగ్రహహనం, ఫిలోమిన్ రాజ్ కూర్పు అందిస్తున్నారు.

ఇక జపాన్ చిత్రంతో పాటు కార్తి.. తన 26వ చిత్రంలోనూ నటిస్తున్నారు. నలన్‌ కుమార సామి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో కంప్లీట్ అవుతుందని సమాచారం అందింది.

దీని తర్వాత '96' సినిమా ఫేమ్ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీ నవంబర్‌లో సెట్‌ పైకి వెళ్లే అవకాశ ముంది. ఇక వీటి తర్వాత 'సర్దార్‌ 2', 'ఖైదీ 2' చిత్రాలు 2024లో సెట్స్ పైకి వెళ్తాయని సినీ వర్గాల ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.