Begin typing your search above and press return to search.

నేను వెండి ప‌ళ్లెంలో తిన్న న‌టుడ్ని కాదు!

తాజాగా త‌న కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. 'నాకు ఎలాంటి గైడెన్స్ లేదు. నా మార్గాన్ని, ల‌క్ష్యాన్ని నేనే నిర్దేశించుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:30 AM GMT
నేను  వెండి ప‌ళ్లెంలో తిన్న న‌టుడ్ని కాదు!
X

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్య‌న్ ఎదిగిన వైనం న‌వ‌త‌రానికి స్పూర్తి. అప్ప‌ట్లో అమితాబ‌చ్చ‌న్ ఎలా ఎదిగారో? ఇప్పుడు కార్తీక్ కూడా అలాగే ఇండ‌స్ట్రీలో ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన న‌టుడు. తాజాగా త‌న కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. 'నాకు ఎలాంటి గైడెన్స్ లేదు. నా మార్గాన్ని, ల‌క్ష్యాన్ని నేనే నిర్దేశించుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. డెబ్యూ డైరెక్ట‌ర్ తో ప‌నిచేస్తోన్న స‌మ‌యంలో నా వ‌ద్ద‌కు ఏ 500 కోట్ల డైరెక్ట‌ర్ వ‌చ్చి ఆఅవ‌కాశం ఇవ్వ‌లేదు.

అలా నాకెందుకు అవ‌కాశం ఇస్తారు? నేడు వెండి ప‌ళ్లెంలో తిన్న‌వాడిని కాదు. నా పుడ్ నేను కొనుక్కునే వాడిని. నా ప్లేట్ నేనే క‌డుకున్కునే వాడిని. నా అవ‌కాశాల‌ను నేనే సృష్టించుకున్నా. ఆరంభంలోనే 500 కోట్ల రూపాయ‌ల మార్కెట్ ఉన్న ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డం వ‌ల్ల నాకు ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌నిపించింది. కొత్త దర్శ‌కుల‌తో ప‌నిచేస్తేనే ఎక్కువ‌గా నేర్చుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. వాళ్ల‌తో ఎంతో ప్రీగా మూవ్ అవుతాం.

ఎలాంటి ఒత్తిడికి గురికాం. బాక్సాఫీస్ లెక్క‌లు అనే దానికి చాలా కార‌ణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఆ సినిమాకు ప‌ని చేసిన టీమ్ ఎలా ఉంది? వారి చివరి సినిమా ఏంటి? దాని ఫ‌లితం ఎలా ఉంది? ఏ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా సినిమాలు చూస్తున్నారు? ఇది సంవత్సరంలో కీల‌క‌మైనా తేదీనా? సెల‌వులు క‌లిసొచ్చాయా? ఇలా ఎన్నో లెక్క‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అంచ‌నా వేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు బాగా లెక్కించబడినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురి కావాల్సిన ప‌నిలేదు.

సినిమా చేసిన త‌ర్వాత రిలాక్స్ అయిపోవ‌చ్చు. కానీ బాక్సాఫీస్ , సినిమా విడుదల తేదీ విండో అనేది అందరికీ ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ కాదని నా అభిప్రాయం. నా విష‌యానికి వ‌స్తే నేను పెద్ద‌గా అదృష్ట వంతుడ‌నుకోను. మ‌న‌లో శ‌క్తి సామార్ధ్యాలు ఎలా ఉన్నాయి. మ‌నం ఎలా ప‌నిచేస్తున్నాం? అన్న‌ది మాత్ర‌మే చూసుకుంటాను. ఒక‌రితో పోలిక చేసు కోవ‌డం...ఫిర్యాదులు చేయ‌డం వంటి వాటి గురించి ఎప్పుడు ప‌ట్టించుకోను' అని అన్నాడు.