సూర్యకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో!
కోలీవుడ్ స్టార్ సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Nov 2024 9:30 AM GMTకోలీవుడ్ స్టార్ సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఇంతవరకూ టైటిల్ నిర్ణయించలేదు. ప్రచారం పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతోన్న టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు.
అయితే టైటిల్ విషయంలో తాజాగా ఓ సమస్య వెలుగులోకి వచ్చింది. సూర్య సినిమాకి స్టోరీ ఆధారంగా `కల్ట్` అనే టైటిల్ పెట్టాలని కార్తీక్ సుబ్బరాజ్ భావిస్తున్నాడు. కానీ ఇదే టైటిల్ యంగ్ హీరో అధర్వ సినిమాకు పెట్టారు. ఆ టైటిల్ ఛాంబర్ లో కూడా రిజిస్టర్ అయింది. అయితే ఈ టైటిల్ విషయంలో కార్తీక్ సుబ్బరాజ్ ఆ సినిమా మేకర్స్, అధ్వర్యతో చర్చించగా, తమ సినిమాను కాదని మరో చిత్రానికి టైటిల్ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పారుట.
తమ సినిమాకి `కల్ట్` అనే టైటిల్ పక్కాగా యాప్ట్ అవుతుందని కార్తీక్ ని మరో టైటిల్ చూసుకోవాల్సిందిగా తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో సూర్య 44కి టైటిల్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సూర్య చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ప్రచారం పనులు కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడేమో టైటిల్ సెట్ కాని పరిస్థితి.
మరి దీనికి సంబంధించి నేరుగా హీరో సూర్య రంగంలోకి దిగి అడిగితే ఇస్తారేమో చూడాలి. సాధారణంగా చిన్న సినిమా- పెద్ద సినిమా టైటిల్స్ ఒకేలా ఉన్నప్పుడు చిన్న సినిమా దర్శక, హీరోలు వెనక్కి తగ్గి వదులుకుంటారు. అగ్ర హీరోని ఆ రకంగా గౌరవించడం అన్నది చాలా చోట్ల జరుగుతుంది. మరి ఇవ్వం అని తెగేసి చెప్పిన నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ ఎలాంటి టైటిల్ తో చూడాలి.