ప్రఖ్యాత అవార్డుతో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన నటుడు!
తాజాగా కార్తీక్ ఆర్యన్ ప్రఖ్యాత ఐఎఫ్ ఎఫ్ ఎం పురస్కారానికి ఎంపిక కావడం చర్చకు దారి తీసింది.
By: Tupaki Desk | 25 July 2023 1:45 PM GMTయంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ని బాలీవుడ్ పరిశ్రమ ఎదగకుండా తొక్కేస్తుందని నిన్నమొన్నటివరకూ నెట్టింట ప్రచారం వెడెక్కించిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే 'దోస్తానా -2' నుంచి నిర్ధాక్షణ్యంగా కార్తీక్ ని తొలగించారని అభిమానులు మండిపడ్డారు. ధర్మ ప్రొడక్షన్స్ కావాలానే కార్తీక్ ని తప్పించి మరో నటుడ్ని తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. అయితే దీని వెనుక మరో కారణం కూడా వినిపించింది.
కార్తీక్ ప్రవర్తన సరిగ్గా లేకనే ధర్మ ప్రొడక్షన్స్ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నది మరో వాదన. అయితే చిన్న నటుడిపై పెద్ద నిర్మాణ సంస్థ ఇలాంటి చర్యకి పాల్పడితే సహజంగానే నటుడివైపు కొంత సింపతీ కనిపిస్తుంది. ఆ రకంగా కార్తీక్ ఆర్యన్ పై మీడియా కాస్త చిన్న చూపు చూసింది. మీడియా కథనాలు మెజార్టీ భాగం అతనికి పేవర్ గానే వెలువడ్డాయి. ఆ సంగతి పక్కనబేడితే..
తాజాగా కార్తీక్ ఆర్యన్ ప్రఖ్యాత ఐఎఫ్ ఎఫ్ ఎం పురస్కారానికి ఎంపిక కావడం చర్చకు దారి తీసింది. రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఉత్తమ నటుడి అవార్డు.. పలు నామినేషన్లు.. అగ్ర హీరోయిన్లకు జోడీగా నటించడం ఇవన్నీ కేవలం కార్తీక్ కెరీర్ ప్రారంభించిన రెండేళ్లలోనే జరిగింది.
తన ప్రవర్తన నిజంగా సరిగ్గా లేకపోతే ఇలా ఇన్ని సాధించగలడా? అన్నది అతి పెద్ద ప్రశ్న. అతడిలో ఈ రకమైన దూకుడు గుర్తించే ఇప్పుడీ అవార్డు వరించదన్నది ప్రధాన కారణంగా మీడియాలో హైలైట్ అవుతోంది.
14వ ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో కార్తీక్ ఆర్యన్ కి రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును జ్యూరీ ప్రకటించింది. కార్తీక్ సాధించిన విజయాలు..భారతీయ సినిమాకి తను అందించిన సేవలకు గుర్తుగా ఈపురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆగస్టు 11న ఆస్ట్రేలియా మెల్ బోర్న్ వేదికగా ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
కార్తీక్ కి ఈ అవార్డు వరించడంపై బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. నిజంగా అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోయినా..క్రియేటివ్ పరంగా విబేధించే నటుడైతే ఇలాంటి మైలు రాయి ఎలా సాద్యమైందని కొందరి నిపుణుల్లో చర్చకొస్తుంది. అసలు కార్తీక్ గతం ఏంటి? ఎక్కడ నుంచి వచ్చాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏంటి? వంటి వివరాలు తవ్వే ప్రయత్నాలు జరుగుతున్నాయి.