Begin typing your search above and press return to search.

జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా 'కార్తికేయ‌-2'

తొలుత ఈ చిత్రాన్ని ఎలాంటి అంచ‌నాలు లేకుండానే పాన్ ఇండియా లో రిలీజ్ చేసారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:25 AM GMT
జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా కార్తికేయ‌-2
X

70వ జాతీయ చ‌ల‌న చిత్రోత్సావాల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా `కార్తికేయ‌-2` అవార్డు ద‌క్కించుకుని మ‌రో సంచ‌ల‌నం న‌మోదు చేసింది. ఇదే అవార్డుకు తెలుగు నుంచి `బ‌ల‌గం`, `సీతారామం`, `మేజ‌ర్` సినిమాలు పోటీ ప‌డ‌గా జ్యూరీ `కార్తికేయ‌-2` చిత్రాన్ని ఉత్త‌మ చిత్రంగా ఎంపిక చేసింది. ఈ నాలుగు సినిమాలు మంచి విజ‌యం సాధించిన చిత్రాలే.

`మేజ‌ర్` సినిమా దేశ‌భ‌క్తి నేప‌థ్యంతో,` సీతారామం` చిత్రాన్ని ల‌వ్ స్టోరీ నేప‌థ్యంతోనూ, `బ‌లగం` చిత్రాన్ని కుటుంబ అనుబంధాల నేప‌థ్యంతో తెర‌కెక్కించారు. `కార్తికేయ‌-2` మాత్రం వీట‌న్నింటికి భిన్న‌మైన చిత్రం. కృష్ణ‌త‌త్వాన్ని ఆధారంగా చేసుకుని యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి తెర‌కెక్కించారు. హిందుత్వం కాన్సెప్ట్ పాన్ ఇండియాకి క‌నెక్ట్ చేయ‌డం లో మంచి స‌క్సెస్ అయ్యారు.

తొలుత ఈ చిత్రాన్ని ఎలాంటి అంచ‌నాలు లేకుండానే పాన్ ఇండియా లో రిలీజ్ చేసారు. చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన థియేటర్ల నుంచి ఊహించ‌ని రెస్పాన్స్ రావ‌డంతో పాటు, మౌత్ టాక్ తో సినిమా జ‌నాల్లోకి వెళ్లింది. దీంతో సినిమాకి థియేట‌ర్లు పెంచారు. తెలుగు ఆడియ‌న్స్ కంటే నార్త్ ఆడియ‌న్స్ కి మ‌రింత‌గా క‌నెక్ట్ అయింది.

పాన్ ఇండియాలో సినిమా అంత పెద్ద స‌క్సెస్ సాధించిదంటే ఉత్త‌రాది ప్రేక్ష‌కులే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ రీజియ‌న్ నుంచి భారీ వ‌సూళ్లు సాధించింది. ఇప్పుడు జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఎంపిక‌వ్వ‌డం వెనుక అక్క‌డ ఆడియ‌న్స్ కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పొచ్చు. ఇందులో నిఖిల్ హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ర్ హీరోయిన్ గా న‌టించింది. అభిషేక్ అగ‌ర్వాల్- టి.జి విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఆగ‌స్టు 13, 2022లో ఈ సినిమా రిలీజ్ అయింది.