Begin typing your search above and press return to search.

2026 లోనే కార్తికేయ 3..?

చందు మొండేటి నిఖిల్ ఇద్దరు కలిసి చేసిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   20 April 2024 6:44 AM GMT
2026 లోనే కార్తికేయ 3..?
X

యువ హీరోల్లో నిఖిల్ స్వతాహాగా తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్న నిఖిల్ స్వామి రారా సినిమా నుంచి తన పంథా మార్చుకున్నాడు. ఇక నిఖిల్ కెరీర్ లో కార్తికేయ ఒక క్రేజీ మూవీ అని చెప్పొచ్చు. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో 8 ఏళ్ల తర్వాత 2022 లో ఆ సినిమా సీక్వల్ తీశారు.

చందు మొండేటి నిఖిల్ ఇద్దరు కలిసి చేసిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టి తన స్టామినా చూపించాడు నిఖిల్. అయితే కార్తికేయ 2 ఎండింగ్ లోనే కార్తికేయ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. అంతేకాదు దానికి సంబందించిన కొంత రష్ కూడా చూపించారు. కార్తికేయ 3 మరింత భారీగా ఉండబోతుందని అర్ధమవుతుంది. కార్తికేయ 2 హిట్ అవ్వడం వల్ల కార్తికేయ 3 కి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నారు.

అయితే కార్తికేయ 3 ఇప్పటికే కథ లాక్ చేయగా సినిమాను త్వరలో మొదలు పెడతారని అనుకున్నారు. కానీ నిఖిల్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు పూర్తి చేస్తే కానీ కార్తికేయ 3 మొదలయ్యే ఛాన్స్ లేదు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి చేశాకనే కార్తికేయ 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. చందు మొండేటి కూడా నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి చేశాక నిఖిక్ కార్తికేయ 3 పై ఫోకస్ చేయనున్నాడు.

కార్తికేయ 3 నెక్స్ట్ ఇయర్ మొదలైనా 2026 చివర్లో లేదా 2027 దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. కార్తికేయ 3 సినిమా కోసం ఆ సినిమా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కార్తికేయ 3 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన చరిత్ర ఆనవాళ్ల గురించి.. ఆధ్యాత్మికత గురించి చెప్పబోతున్నాడు. సినిమా పై ఉన్న బజ్ తో హడావిడిగా కానివ్వకుండా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తన సినిమాల లైనప్ తో నిఖిల్ ఆడియన్స్ లో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఏ రేంజ్ కు వెళ్తాడన్నది చూడాలి.