భార్యతో యంగ్ హీరో వెకేషన్.. పిక్స్ వైరల్
నేడు కార్తికేయ, లోహిత రెడ్డి ల రెండో పెళ్లి రోజు. ఈ ప్రత్యేకమైన రోజు ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం వీరిద్దరు వెకేషన్ లో ఉన్నారు.
By: Tupaki Desk | 25 Nov 2023 2:30 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సినిమా వార్తతో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సందడి చేస్తూ ఉండే హీరో కార్తికేయ ఈసారి తన పెళ్లి రోజు కావడంతో షేర్ చేసిన ఫోటోల కారణంగా వార్తల్లో నిలిచాడు.
నేడు కార్తికేయ, లోహిత రెడ్డి ల రెండో పెళ్లి రోజు. ఈ ప్రత్యేకమైన రోజు ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం వీరిద్దరు వెకేషన్ లో ఉన్నారు. 2021 లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అప్పుడు చిరంజీవి తో పాటు ఎంతో మంది ప్రముఖ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు వీరి పెళ్లికి హాజరు అయిన విషయం తెల్సిందే.
ఇక కార్తికేయ మరియు లోహిత రెడ్డి ల యొక్క ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో ఆసక్తికర చర్చ కూడా జరిగేది. దాదాపు గా పది సంవత్సరాల పాటు వీరిద్దరు ప్రేమించుకున్నారు. కార్తికేయ కెరీర్ లో నిలదొక్కుకోవడం కోసం మరియు ఇతర విషయాల కారణంగా దాదాపు పదేళ్ల పాటు వీరు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు.
ప్రేమించుకుని పెళ్లి చేసుకునే విషయంలో వీరిద్దరూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అనడంలో సందేహం లేదు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ లవ్లీ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన కార్తికేయ తన భార్యకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇక కార్తికేయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. వచ్చే వచ్చే ఏడాది సమ్మర్ లో ఒక సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. కార్తికేయ, లోహిత రెడ్డి లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేలాది మంది సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపిస్తున్నారు.