Begin typing your search above and press return to search.

క్రింద‌కు లాగ‌డం కంటే ఎద‌గ‌డంపై దృష్టి పెట్టండి!

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం వ‌చ్చిన త‌ర్వాత సెల‌బ్రిటీలు ట్రోలింగ్ కి గురికావ‌డం, విమ‌ర్శ‌లు ఎదుర్కోవ డం వంటివి ప‌రిపాటిగా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 11:27 AM GMT
క్రింద‌కు  లాగ‌డం కంటే ఎద‌గ‌డంపై దృష్టి పెట్టండి!
X

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం వ‌చ్చిన త‌ర్వాత సెల‌బ్రిటీలు ట్రోలింగ్ కి గురికావ‌డం, విమ‌ర్శ‌లు ఎదుర్కోవ డం వంటివి ప‌రిపాటిగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో అవి ప‌రిమితులు దాటుతున్నాయి. అవి బ్యాలెన్స్ గా ఉన్నంత కాలం ఆరోగ్య క‌రంగానే ఉంటుంది. కానీ హ‌ద్దు మీరితేనే ర‌క‌ర‌కాల వివాదాల‌కు దారి తీసే అవకాశం ఉంది. తాజాగా ఓ యూట్యూబ‌ర్ ప‌రిమితులు దాటి జోకులు వేయ‌డంపై యువ న‌టుడు కార్తికేయ గుమ్మ‌డి కొండ త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ఆ విష‌యం ఆయ‌న మాట‌ల్లోనే...` ఈ ఒక్క సందర్భం మాత్రమే కాదు. ఇతరులపై ఇలాంటి కించపరిచే జోకులు పేల్చడం ప‌రిపాటిగా మారింది. ఈ రోజుల్లో తమను తాము కూల్/న్యూ ఏజ్ అని చెప్పుకోవడం ఒక ట్రెండ్‌గా మారిందని భావిస్తున్నాను. చాలా మంది అలాంటి కంటెంట్‌ను ప్రోత్స‌హిస్తున్నారు. వాళ్ల‌ను చూసి మ‌రింత మంది అదే మార్గంలో న‌డుస్తున్నారు. అవి నిరంత‌రం అలా కొనసాగుతూనే ఉన్నాయి.

అలాంటి కంటెంట్ ని ఎవ‌రూ ప్రోత్స‌హించ‌వ‌ద్దు. ఏంచేసినా హుందాగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి. ఏ జోకు వేసినా అది హెల్దీ గా ఉండాలి. ఇత‌రులు నొచ్చుకునేలా ఉండ‌కూడ‌దు. కించ‌ప‌రిచే విధానం అనేది స‌మాజంలోకి చెడుగా తీసుకెళ్తుంది. మంచి క‌న్నా చెడే వేగంగా స‌మాజంలోకి వెళ్తుంది. ఒకరినొకరు క్రిందికి లాగడంపై దృష్టి పెట్టే బదులు, వ్యక్తిగతంగా ఎదగడం, ఇతరులు ఎదుగుద‌ల‌లో తోడ్ప‌డం, సహాయం చేయడంపై దృష్టి పెట్టండి.

నేను ఈ ఒక ప్రత్యేకమైన జోక్‌నే కాదు అసభ్యకరమైన, కించపరిచే వ్యాఖ్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను` అని అన్నారు. కార్తికేయ న‌టించిన `భ‌జేవాయు వేగం` ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. ప్ర‌స్తుతం కార్తికేయ కొత్త ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.