Begin typing your search above and press return to search.

వాట్ ఈజ్ కార్తికేయ చెప్పే సినిమా ఇది..!

తన కెరీర్ తో పాటుగా భజే వాయు వేగం సినిమా గురించి కార్తికేయ చెప్పిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

By:  Tupaki Desk   |   24 May 2024 11:45 AM GMT
వాట్ ఈజ్ కార్తికేయ చెప్పే సినిమా ఇది..!
X

RX 100 తో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కాని సక్సెస్ అందుకోవడంలో విఫలమయ్యాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన బెదురులంక 2012 మళ్లీ కార్తికేయను తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ప్రస్తుతం కార్తికేయ లీడ్ రోల్ లో ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భజే వాయు వేగం. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తుపాకి.కామ్ కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో కార్తికేయ. తన కెరీర్ తో పాటుగా భజే వాయు వేగం సినిమా గురించి కార్తికేయ చెప్పిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కార్తికేయ అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అన్న ప్రశ్నకు సమాధానంగా.. చిన్నప్పటి నుంచి తనకు యాక్టర్ కావాలని ఉంది. స్కూల్, కాలేజ్ ఎక్కడ అయినా సరే నేను హీరో అని చెప్పుకునే వాడిని. జరుగుతుందా లేదా అన్నది ఆలోచించలేదు అలా డిసైడ్ అయిపోయా అన్నారు కార్తికేయ.

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నమ్మకంతో ముందుకు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సినిమా ఛాన్సులు కష్టమని ఇక్కడకి వచ్చాక తెలిసిందని.. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే ఇష్టమని చెప్పారు కార్తికేయ.

కార్తికేయ మొదటి సినిమా RX 100 కాదా..? మొదటి సినిమా ప్రేమతో మీ కార్తిక్ అది ఎవరికి తెలియదు. అయితే ఆ తర్వాత RX 100 సూపర్ హిట్ అయ్యింది. సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. తను కూడా అంత హిట్ కి డిసైడ్ అవ్వలేదు అన్నారు కార్తికేయ ఆ తర్వాత తనను నమ్మి డబ్బులు పెట్టడం ఇదంతా కొత్తగా అనిపించిందని అన్నారు.

ఇక సినిమా హిట్ అయ్యాక వరుస ఆఫర్లు వచ్చాయి ఈ క్రమంలో కెరీర్ లో అప్స్ అండ్ డౌన్ ఇవన్నీ కూడా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని అర్ధమైందని చెప్పుకొచ్చారు కార్తికేయ. సినిమా ఫెయిల్యూర్స్ తనలో మార్పులు తెచ్చాయని అంటున్నారు కార్తికేయ. అందరు అడ్వైస్ చేస్తారు కాని అందులో ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అన్నది మనం నిర్ణయించుకోవాలని తెలిసింది అన్నారు కార్తికేయ.

ఇక భజే వాయు వేగం సినిమా గురించి చెబుతూ వాట్ ఈజ్ కార్తికేయ అని చెప్పే సినిమా ఇది. అప్పటికి ఇప్పటికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. అందుకే తొందర పడట్లేదు.. నెక్స్ట్ సినిమా ఇంకా సైన్ చేయలేదు అన్నారు కార్తికేయ.

భజే వాయు వేగం సినిమాకు మంచి ఇక్వేషన్ సెట్ అయ్యింది. ఇక నుంచి ఇదే విధంగా బెటర్ స్క్రిప్ట్ బెటర్ మూవీస్ చేస్తానని అన్నారు కార్తికేయ.

డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి కథ చెప్పినప్పుడే తాను దేనికోసం వెతుకుతున్నానో అలాంటి కథ దొరికినట్టు అనిపించిందని అన్నారు కార్తికేయ. వీటితో పాటు సినిమాకు సంబందించిన చాలా విషయాలు కార్తికేయ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంటర్వ్యూ పై ఒక లుక్కేయండి .