Begin typing your search above and press return to search.

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని టైటిల్ 'మిరాయి'?

సంక్రాంతి స్టార్ హీరోల‌తోనే పోటీ ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో తేజ త‌దుప‌రి ప్రాజెక్ట్ కూడా లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:41 AM GMT
కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని టైటిల్ మిరాయి?
X

యంగ్ హీరో తేజ స‌జ్జా వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ బిజీగా క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 'జాంబిరెడ్డి'తో హీరోగా ప‌రిచ‌య‌మైన తేజ అటు పై చేసిన రెండు ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌న‌ప్ప‌టికీ అవ‌కాశాల ప‌రంగా తిరుగులేదు. ట్యాలెంట్ తో ఛాన్సులు ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం 'హ‌నుమాన్' తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై బ‌జ్ బాగానే ఉంది. సినిమాని విజువ‌ల్ గా మార్కెట్ లో కి తీసుకెళ్తున్నారు.

సంక్రాంతి స్టార్ హీరోల‌తోనే పోటీ ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో తేజ త‌దుప‌రి ప్రాజెక్ట్ కూడా లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ తేజ‌తో ఓ సినిమా నిర్మించేందుకు ఒప్పందుకు చేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం కార్తీక్ అదే నిర్మాణ‌సంస్థ‌లో ర‌వితేజ హీరోగా' ఈగ‌ల్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కానీ ఆ రిలీజ్ తో సంబంధం లేకుండానే కార్తిక్ ప‌నిత‌నం మెచ్చిన పీపూల్ మీడియా ప్యాక్ట‌రీ మ‌రో అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. ఈ సినిమా కూడా ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభించార‌ని వినిపిస్తుంది. ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. అలాగే ఇందులో మంచు మ‌నోజ్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రికొంత మంది మ‌నోజ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు? అని అంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా లీకైంది.

'మిరాయి' అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలిసింది. ధమాకా వన్-ఇయర్ వేడుకల్లో సీనియర్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య- కార్తీక్ ఘట్టమనేనిని అభినందించారు. ఇదే సంద‌ర్భంలో 'ఈగిల్' .. 'మిరాయి' చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలోనే తేజ త‌దుప‌రి సినిమా 'మిరాయి' అని తెలుస్తోంది. ఇక మిరాయి అంటే? ఇదొక జ‌ప‌నీస్ ప‌దంగా తెలుస్తోంది. అంటే భ‌విష్య‌త్ అని అర్ధం. ఇందులో హీరోని భ‌విష్య‌త్ లోకి తీసుకెళ్లి? ఆ కాలంలో ఏం జ‌ర‌గ‌బోతుంది? అన్న‌ది క‌థ‌లో హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు వినిపిస్తుంది.