గేమ్ ఛేంజర్.. కాపాడాల్సింది 'ఒకే ఒక్కడు'
సేనాపతిగా కమల్ హాసన్ కష్టపడి నటించినప్పటికి సినిమాలో అసలైన ఎమోషన్ మిస్సవ్వడంతో గట్టి దెబ్బె పడింది
By: Tupaki Desk | 13 July 2024 6:43 AM GMTదేశం మెచ్చిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2తో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సేనాపతిగా కమల్ హాసన్ కష్టపడి నటించినప్పటికి సినిమాలో అసలైన ఎమోషన్ మిస్సవ్వడంతో గట్టి దెబ్బె పడింది. అయితే ఇండియన్ 2 రిజల్ట్ కచ్చితంగా గేమ్ ఛేంజర్ పై ప్రభావం చూపుతుందనే మాట ముందు నుంచి వినిపిస్తున్నదే. ఇక రిజల్ట్ పై క్లారిటీ రావడంతో మెగా ఫ్యాన్స్ లో అసలైన టెన్షన్ మొదలైంది.
అయితే ఒకే ఒక్క విషయం మాత్రం గేమ్ ఛేంజర్ పై ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తోంది. అదేమిటంటే సినిమాకు కథను అందించిన కార్తిక్ సుబ్బరాజ్. ఈ ఒకే ఒక్కడు సినిమాని కాపాడతాడు అని ఫ్యాన్స్ చివరి ఆశతో ఉన్నారు. ఈ దర్శకుడి రైటింగ్ పవర్ ఎలాంటిదో పిజ్జా, జిగర్తాండా సినిమాలు రుజువుచేశాయి. ఆ తరువాత మహాన్, పేట లాంటి సినిమాలు పెద్దగా ఆడకపోయినా రైటర్ గా మాత్రం కార్తిక్ విఫలమవ్వలేదు.
ఇక అతనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు కథను అందించాడు. శంకర్ గారు అయితేనే ఈ కథకు న్యాయం చేయగలరని ఎంతో ఇష్టపడి మరీ స్క్రిప్ట్ రాసిచ్చాడు. కాబట్టి ఓ వర్గం మెగా ఫ్యాన్స్ మాత్రం కార్తిక్ పైనే నమ్మకం ఉంచారు. కథ స్క్రీన్ ప్లే బాగుంటే శంకర్ సరైన న్యాయం చేయగలడు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే శంకర్ తన కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల విజయంలో కథలే ప్రధాన పాత్ర పోషించాయి.
ఎక్కువ శాతం రైటర్స్ తో కలిసి మంచి సందేశం ఉండేలా స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శంకర్ కెరీర్ గ్రోత్ లో సుజాత రంగరాజన్ అనే రైటర్ పాత్ర చాలానే ఉంది. జెంటిల్ మెన్, ఇండియన్, ఓకే ఒక్కడు, అపరిచితుడు, రోబో ఇలా బిగ్ హిట్ గా నిలిచిన ప్రతీ సినిమాకి రైటర్ గా వర్క్ చేసింది సుజాత రంగరాజన్ గారే.
ఎప్పుడైతే ఆయన కాలం చేశారో, అప్పటి నుంచి శంకర్ జడ్జిమెంట్ తేడా కొడుతోంది. సుజాత రంగరాజన్ ఉన్నప్పుడు శంకర్ కథలో లోటు పాట్లు సరిచేసేవారు. కథల కంటే కూడా స్క్రీన్ ప్లే, మాటలు అందించిన సందర్భాలు ఎక్కువే. ఇప్పుడు ఆయన లేని లోటు బలంగా కనిపిస్తోంది. కాబట్టి శంకర్ వెంటనే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.