Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ కి పోటీగా అత‌డు దిగుతున్నాడా?

అయితే స‌రిగ్గా ఇదే తేదీకి కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా న‌టిస్తోన్న 'మెయ‌గ‌ళ‌న్' అనే సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2024 5:30 PM GMT
యంగ్ టైగ‌ర్ కి పోటీగా అత‌డు దిగుతున్నాడా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి పోటీగా కోలీవుడ్ స్టార్ కార్తీ బ‌రిలోకి దిగుతున్నాడా? సై అంటే సౌ అంటూ కార్తీ దూసుకొస్తున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'దేవ‌ర' భారీ అంచ‌నాల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ తేదీకి విడుద‌ల చేయాల‌ని కోర‌టాల ప‌ట్టు మీద ప‌ని చేస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత తార‌క్ సినిమా ప్రేక్షుక‌ల ముందుకొచ్చి కూడా సంవ‌త్స‌రాలు గ‌డుస్తోంది. దీంతో అభిమానులు తార‌క్ కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి ప‌రిస్థితుల్లో 'దేవ‌ర' మొద‌టి భాగాన్నీ ఆ తేదీకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 'దేవ‌ర' ఆ తేదీ లాక్ చేసుకోవ‌డంతో చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి. పాన్ ఇండియా సినిమాతో పోటీ ప‌డితే న‌ష్టం త‌ప్ప‌ద‌ని ఇత‌ర హీరోలంతా వెన‌క్కి త‌గ్గారు.

అయితే స‌రిగ్గా ఇదే తేదీకి కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా న‌టిస్తోన్న 'మెయ‌గ‌ళ‌న్' అనే సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. '96' ఫేం ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ‌నాట ఫేమ‌స్ అయిన జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యం కూడా ఉంది. జ‌ల్లిక‌ట్టు స‌న్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని యూనిట్ చెబుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్లు..ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.

ఈ సినిమాకి కూడా సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ తేదీగా మేక‌ర్స్ భావిస్తున్నారు. త‌మిళ‌నాట 'దేవ‌ర‌'కి..తెలుగు నాట కార్తీ సినిమాల‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌న్న‌ది ఒక వెర్ష‌న్ అయితే. రెండు సినిమాలకు థియేట‌ర్ల‌ను ప‌ర్పెక్ట్ గా బ్యాలెన్స్ చేసి..హిట్ టాక్ తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న‌ది మ‌రో వెర్ష‌న్. కార్తీకి తెలుగు మార్కెట్ ఉన్న హీరో. అత‌డి సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్న సంగ‌తి తెలిసిందే.