Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ సీక్వెల్ రెండు ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్‌

పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సర్దార్ సినిమా తమిళ స్పై చిత్రాల్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:51 AM
హిట్‌ మూవీ సీక్వెల్ రెండు ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్‌
X

తమిళ హీరో కార్తీ తెలుగు లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈయన నటించిన ప్రతి సినిమాను కూడా తెలుగు లో డబ్‌ చేస్తున్నారు. గతంలో కార్తీ నటించిన పలు సినిమాలు తమిళ్ తో సమానంగా తెలుగు లో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కార్తీ తెలుగు లో భారీ విజయాలను సొంతం చేసుకోవడం లో విఫలం అవుతున్నారు.

తెలుగు లో ఆయన కమ్‌ బ్యాక్ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. గత ఏడాది కార్తీ 'సర్దార్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ స్ఫై థ్రిల్లర్‌ తెలుగు లో కమర్షియల్‌ గా గొప్ప ఫలితాన్ని సొంతం చేసుకోలేదు కానీ తమిళనాట మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌.

పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సర్దార్ సినిమా తమిళ స్పై చిత్రాల్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ చేస్తే బాగుంటుందని యూనిట్‌ సభ్యులు గతంలోనే నిర్ణయించుకున్నారు. కార్తీ సీక్వెల్‌ కు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పని జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సర్దార్‌ సినిమా సీక్వెల్ గురించి ప్రస్తుతం రెండు ఆసక్తికర అప్డేట్స్ తమిళ్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. అవేంటి అంటే ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటుంది. దర్శకుడు మిత్రన్‌ అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తమిళ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ సీక్వెల్‌ గురించిన మరో విషయం ఏంటి అంటే.. మొదటి పార్ట్‌ కు జీవి ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించగా ఈ సీక్వెల్‌ కు మాత్రం మరో యువ సంచలన సంగీత దర్శకుడు యువన్ శంకర్‌ రాజా ను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ రెండు అప్‌డేట్స్ తో కార్తీ అభిమానులు సర్దార్‌ 2 కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.